Whatsapp Offline Trick: డేటా ఆఫ్ చెయ్యకుండా వాట్సాప్ ఆఫ్ చెయ్యొచ్చు

Whatsapp Offline Trick: డేటా ఆఫ్ చెయ్యకుండా వాట్సాప్ ఆఫ్ చెయ్యొచ్చు
HIGHLIGHTS

వాట్స్ఆప్ లో మనకు తెలియని చాలా ట్రిక్స్ ఉన్నాయి

Whatsapp నోటిఫికేషన్ల నుండి ఈ ట్రిక్ తో తప్పించుకోవచ్చు

మీ ఫోన్ ఇంటర్నెట్ ను ఆఫ్ చెయ్యకుండానే మీ వాట్స్ఆప్ ను ఆఫ్ చెయ్యవచ్చు

ముఖ్యమైన పనిలో లేదా మీటింగ్ లేదా మరింకేదైనా ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు వచ్చే వాట్స్ఆప్ నోటిఫికేషన్స్ మీకు చిరాకు  కలిగించవచ్చు. అయితే, డేటా ఆఫ్ చేస్తే ఇతర పనులకు ఆటంకం కలుగవచ్చు. కానీ, వాట్స్ఆప్ లో మనకు తెలియని చాలా ట్రిక్స్ ఉన్నాయి. ప్రతిఒక్కరికి వారి అవసరాలను బట్టి అవి వారికీ ఉపయోగపడతాయి.

ఈరోజు మన చూడబోయే ట్రిక్ మాత్రం నిజంగా సూపర్ ట్రిక్. ఎందుకంటే, ఈ ట్రిక్ తో మీ ఫోన్ ఇంటర్నెట్ ను ఆఫ్ చెయ్యకుండానే Whatsapp ని ఆఫ్ చేయవచ్చు. మీరు ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్ప్పుడు ఎక్కువగా వచ్చే Whatsapp నోటిఫికేషన్ల నుండి ఈ ట్రిక్ తో తప్పించుకోవచ్చు.     

నెట్ ఆఫ్ చెయ్యకుండా Whatsapp ఆఫ్ చెయ్యడానికి గూగుల్ ప్లే స్టోర్ నుండి Pause It App డౌన్ లోడ్ చేసి ఉపయోగించ వలసి వుంటుంది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో 4 స్టార్ రేటింగ్ తో వుంది. అయితే, తర్డ్ పార్టీ యాప్ ని ఉపయోగించడం సేఫ్ అని నమ్మిన తరువాత మాత్రమే ఈ విధంగా చేయండి. ఈ యాప్ తో మీ ఫోన్ ఇంటర్నెట్ ను ఆఫ్ చెయ్యకుండానే మీ వాట్స్ఆప్ ను ఆఫ్ చెయ్యవచ్చు.

దీనికోసం మీరు మీరుచేయవల్సిందల్లా యాప్ డౌన్ లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేయ్యడమే. తరువాత, యాప్ లో Active Apps పైన ఉన్న టోగుల్ బటన్ ని నొక్కితే చాలు మీకు కావాల్సిన యాప్స్ డేటా ఆఫ్ అవుతుంది. అంతేకాదు,  మీరు ఎంత సమయం మీ వాట్స్ఆప్ ని ఆఫ్ చేయాలనుకుంటారో అంత టైం ను కూడా సెట్ చేసుకోవచ్చు.

డేటా ఖర్చు చేయకుండా వాట్స్ఆప్ ఉపయోగించాలి అంటే కూడా ఒక ట్రిక్ వుంది.

ఈ విధంగా చేస్తే మీరు వాట్సాప్‌ లో డేటా వినియోగాన్ని తగ్గించవచ్చు

మొదట వాట్సాప్ తెరిచి, పైన ఉన్న మూడు నిలువు చుక్కలపై నొక్కండి.

ఇప్పుడు సెట్టింగులకు వెళ్లి డేటా మరియు స్టోరేజ్ ఎంపికను ఎంచుకోండి.

ఇక్కడ ఇచ్చిన తక్కువ డేటా వాడకంలో, మీరు కాల్ ఇన్ డేటాను తగ్గించుకునే ఎంపికను పొందుతారు, దాని ప్రక్కన ఇచ్చిన టోగిల్‌ను ఆన్ చేయండి.

అదేవిధంగా, మీరు వాట్సాప్‌లోని ఫోటోలు మరియు వీడియోల నుండి డేటా వినియోగాన్ని కూడా నిరోధించవచ్చు.

దీని కోసం మీరు మళ్ళీ సెట్టింగులకు వెళ్ళాలి.

ఇప్పుడు మీరు డేటా మరియు స్టోరేజి వినియోగంపై క్లిక్ చేయాలి.

ఇప్పుడు మొబైల్ డేటా ఎంపికను ఉపయోగించి లోపలికి వెళ్లి అన్ని పెట్టెల పక్కన ఎంపికను తీసివేయండి.

అదేవిధంగా Wi-Fi లో కనెక్ట్ అయినప్పుడు మరియు రోమింగ్ చేసేటప్పుడు రెండు ఇతర ఎంపికలలో ఒకే విధానాన్ని పునరావృతం చేయండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo