Whatsapp లో ఇక మీకు కావలసిన Emoji తో రియాక్ట్ కావచ్చు..!!

HIGHLIGHTS

Instagram మరియు Facebook యొక్క అడుగుజాడలలోనే వాట్సాప్ కూడా ఫీచర్లను జతచేస్తుంది

నియోగదారులు వారికీ కావాల్సిన ఎమోజి ని ఉపయోగించుకోవచ్చు

ఎమోజి రియాక్షన్ ఫీచర్ కోసం కొత్త అప్డేట్ ను విడుదల చేసింది

Whatsapp లో ఇక మీకు కావలసిన Emoji తో రియాక్ట్ కావచ్చు..!!

Instagram మరియు Facebook యొక్క అడుగుజాడలలోనే వాట్సాప్ కూడా ఫీచర్లను జతచేస్తుంది. మెజెస్ కి Emoji తో రియాక్ట్ అయ్యే ఫీచర్ ను తీసుకొచ్చిన చాలాకాలం తరువాత ఇందులో మరింత అనువైన విషయాన్ని జతచేసింది. ఎమోజి రియాక్షన్ ఫీచర్‌ను ప్రవేశపట్టినప్పుడు కేవలం 6 ఎమోజి లను మాత్రమే ఇందులో అందించింది. అంటే, మీకు వచ్చిన మెసేజ్ కి మీరు రియాక్ట్ అవ్వాలంటే ఇక్కడ అందించిన 6 ఎమోజీ లలో ఏదైనా ఒకటి మాత్రమే ఎంచుకునే వీలుంది. అయితే, ఇప్పుడు పూర్తి ఎమోజి కీబోర్డ్‌ను యాక్సెస్ చేయడానికి వినియోగదారులకు అనుమతిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మొదట ఎమోజి రియాక్షన్ ఫీచర్‌ను ప్రవేశపట్టినప్పుడు వాట్సాప్ కేవలం ఆరు ఎమోజీలను మాత్రమే ఇందులో అందించింది. మెసేజ్ పైన నొక్కిన కొన్ని సెకన్ల తర్వాత, ఈ ఆరు ఎమోజీలు ప్రదర్శించబడ్డాయి, ఇందులో నుండి వినియోగదారులు వారికీ కావాల్సిన ఎమోజి ని ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్ వినియోగదారుల నుండి మంచి స్పందను అందుకోవడంతో, వాట్సాప్ ఈ ఫీచర్ కోసం కొత్త అప్డేట్ ను విడుదల చేసింది. ఈ అప్డేట్ ద్వారా ఎమోజి రియాక్షన్ కోసం పూర్తి ఎమోజి కీబోర్డ్‌ను యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

అయితే, ఈ అప్‌డేట్ వాట్సాప్ వినియోగదారులు అందరి కోసం ఇంకా ప్రకటించలేదు. ఈ ఫీచర్ కేవలం బీటా రిలీజ్ లో ఒక భాగంగా వస్తుంది. అంటే, Android మరియు iOS వినియోగదారుల కోసం వాట్సాప్ బీటా లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ ఈ అప్‌డేట్‌ ను బ్లాగ్ పోస్ట్ ద్వారా ప్రకటించింది. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo