Install App Install App

Whatsapp లో 5 కొత్త ఫీచర్లను జతచేస్తోంది...ఎలా పనిచేస్తాయంటే..!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 22 Oct 2021
HIGHLIGHTS
  • 5 కొత్త ఫీచర్లను వాట్సాప్ కు జతచేయనుంది

  • కొన్ని ఫీచర్లు ఇప్పటికే బీటా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి

  • వాట్సాప్ అప్ కమింగ్ 5 ఫీచర్లు

Whatsapp లో 5 కొత్త ఫీచర్లను జతచేస్తోంది...ఎలా పనిచేస్తాయంటే..!
Whatsapp లో 5 కొత్త ఫీచర్లను జతచేస్తోంది...ఎలా పనిచేస్తాయంటే..!

వాట్సాప్ తన వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించడానికి 5 కొత్త ఫీచర్లను వాట్సాప్ కు జతచేయనుంది. వాస్తవానికి, ఇప్పటికే చాలా ఫీచర్లను అందించినా కూడా వినియోగదారుల అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా కొత్త ఫీచర్లను ఇంకా జతచేస్తూనే వుంది. ఈ అప్ కమింగ్ ఫీచర్లలో కొన్ని ఫీచర్లు ఇప్పటికే బీటా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి మరియు మరికొన్ని ఫీచర్లు డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్నాయి. అంటే, ఈ 5 ఫీచర్లు కూడా రానున్న కొద్దీ కాలంలోనే వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. మరి త్వరలో రానున్న వాట్సాప్ అప్ కమింగ్ 5 ఫీచర్ల గురించి చూద్దాం..!

 1. వాట్సాప్ వాయిస్ నోట్స్ ఫీచర్

వాట్సాప్ గ్లోబల్ వాయిస్ మెసేజ్ ప్లేయర్ కోసం పనిచేస్తోంది. దీని వలన మీరు వాట్సాప్ నుండి బయటకు వచ్చిన తరువాత కూడా వాయిస్ మెసేజ్ లను మీరు వినవచ్చు. అంతేకాదు, వాయిస్ మెసేజ్ లను ఎప్పుడైనా యూజర్లు Pause చేయవచ్చని కూడా వచ్చని WaBetaInfo తెలిపింది.

2. మెసేజ్ రియాక్షన్ ఫీచర్

వాట్సాప్ మరొక కొత్త ఫీచర్ కోసం కూడా పనిచేస్తోంది. అదే, మెసేజ్ రియాక్షన్ ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా వచ్చిన మెసేజ్ లకు ఎమోజీల పంపడం ద్వారా రియాక్ట్ కావచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీకు కావాల్సిన మెసేజ్ ని నొక్కిపట్టుకావాలి, తరువాత అక్కడ కనిపించే ఎమోజీల్లో తగిన ఎమోజీ ఎంచుకోవచ్చు.

3. కొత్త ప్రైవసీ సెట్టింగ్స్

వినియోగదారులకు మెరుగైన సెక్యూరిటీ అందివ్వడానికి వాట్సాప్ కొత్త ప్రైవసీ సెట్టింగ్స్ కోసం పనిచేస్తోంది. నిర్దిష్ట కాంటాక్ట్స్ నుండి మీ స్టేటస్ అప్డట్స్, ప్రొఫైల్ పిక్చర్ మరియు లాస్ట్ సీన్ ఇన్ఫర్మేషన్ వంటి వాటిని Hide( దాచడం) కోసం కొత్త ప్రైవసీ సెట్టింగ్స్ ను అందిచనుంది.

4. మెరుగైన బ్యాకప్ ఫీచర్

WabetaInfo ప్రకారం, వాట్సాప్ క్లౌడ్‌కు యూజర్లు బ్యాకప్ చేయదలిచిన డేటాను ఎంచుకోవడానికి యూజర్లను అనుమతించే 'మేనేజ్ బ్యాకప్ సైజ్' ఫీచర్‌ కోసం కూడా పనిచేస్తోంది. మీ డ్రైవ్ లో ఎక్కువ స్థలాన్ని కేటాయించకుండా ఉండడాని వీలుగా కేవలం యూజర్లు పెద్ద ఫైల్స్ ను మినహాయించవచ్చు.

5. కొత్త చాట్ బబుల్స్

యూజర్స్ చాటింగ్ ను గుండ్రని బ్రైట్ బబుల్స్ రూపంలో చూపేవిధంగా కొత్త వాట్సాప్ కొత్త చాట్ బబుల్స్ ఫీచర్ ను  తీసుకువస్తోంది. వాస్తవానికి, WhatsApp ఇటీవల iOS ప్లాట్‌ఫామ్‌లోని బీటా వినియోగదారుల కోసం కొత్త వెర్షన్ 2.21.200.11 ని విడుదల చేసింది. ఈ బీటా వెర్షన్ నుండి కొత్త చాట్ బబుల్స్ ఫీచర్ ను జతచేసింది. అంటే iOS ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.  

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: whatsapp could roll out new features soon
Tags:
Whatsapp Whatsapp upcoming features Whatsapp new features Whatsapp latest features
Install App Install App
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

KENT Hand Blender 150W (16050), 5 Speed Control, 100% Copper Motor, Multiple Beaters, Overheating Protection, Food Grade Plastic Body
KENT Hand Blender 150W (16050), 5 Speed Control, 100% Copper Motor, Multiple Beaters, Overheating Protection, Food Grade Plastic Body
₹ 1275 | $hotDeals->merchant_name
Professional Feel 260 Watt Multifunctional Food Mixers
Professional Feel 260 Watt Multifunctional Food Mixers
₹ 480 | $hotDeals->merchant_name
Tanumart Hand Mixer 260 Watts Beater Blender for Cake Whipping Cream Electric Whisker Mixing Machine with 7 Speed (White)
Tanumart Hand Mixer 260 Watts Beater Blender for Cake Whipping Cream Electric Whisker Mixing Machine with 7 Speed (White)
₹ 599 | $hotDeals->merchant_name
VEGA Insta Glam Foldable 1000 Watts Hair Dryer With 2 Heat & Speed Settings (VHDH-20)- White
VEGA Insta Glam Foldable 1000 Watts Hair Dryer With 2 Heat & Speed Settings (VHDH-20)- White
₹ 503 | $hotDeals->merchant_name
Philips HR3705/10 300-Watt Hand Mixer, Black
Philips HR3705/10 300-Watt Hand Mixer, Black
₹ 2019 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status