Whatsapp బెస్ట్ ట్రిక్: మీ వాట్సాప్ కాల్ రికార్డింగ్ కోసం బెస్ట్ ట్రిక్

HIGHLIGHTS

వాట్సాప్ లో చాలా ట్రిక్ ఉన్నాయి

మనకు చాలా బాగా ఉపయోగపడతాయి

కొన్ని ట్రిక్స్ లేదా టిప్స్ తెలియకపోవడంతో చాలా ఫీచర్లు మిస్ అవుతుంటా

Whatsapp బెస్ట్ ట్రిక్: మీ వాట్సాప్ కాల్ రికార్డింగ్ కోసం బెస్ట్ ట్రిక్

అత్యంత ప్రజాధారణ కలిగిన చాటింగ్ యాప్ వాట్సాప్ లో చాలా ట్రిక్ ఉన్నాయి. వాటిలో కొన్ని సమయానికి మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ యాప్ చాటింగ్ మన రోజువారీ అవసరాలకు సరైన స్థలంగా మారింది. కొన్ని సందరభాల్లో వాట్సాప్ కి అనుసంధానమైన కొన్ని ట్రిక్స్ లేదా టిప్స్ తెలియకపోవడంతో చాలా ఫీచర్లు మిస్ అవుతుంటారు. వాటిలో, వాట్సాప్ కాల్ రికార్డింగ్  కూడా ఒకటి. అందుకే, ఈరోజు వాట్సాప్ కాల్ ను ఎలా రికార్డ్ చెయ్యాలో చూద్దాం. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వాస్తవానికి, సాధారణ కాల్ ని చాలా ఈజీగా రికార్డింగ్ చెయ్యవచ్చు. ఆటో కాల్ రికార్డింగ్ లేదా కాల్ వచ్చినప్పుడు అక్కడ ఉండే కాల్ రికార్డ్ అప్షన్ ను నొక్కడం ద్వారా కాల్ రికార్డ్ చేయవచ్చు. అదే Whatsapp Call Recording చెయ్యాలంటే ఎలా? ఇక్కడ విషయాన్ని గురించి చూడవచ్చు.

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో Whatsapp Call Recording చాలా సులభంగా సెట్ చేసుకోవచ్చు. దీనికోసం, గూగుల్ ప్లే స్టోర్ లో చాలా తర్డ్ పార్టీ యాప్స్ అందుబాటులో వున్నాయి.Cube Call Recorder వంటి మరేదైనా తర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. తరువాత, మీ వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వారికీ కాల్ చేయండి. ఇక్కడ కాల్ రికార్డింగ్ ఐకాన్ కనబడుతుంది. అంటే, మీ వాట్సాప్ కాల్ రికార్డ్ అవుతుందని అర్ధం.

ఇక iOS ఫోన్ల విషయానికి వస్తే, ఈ ఫోన్లలో వాట్సాప్ కాల్ రికార్డింగ్ కోసం మీ వద్ద Mac సిస్టమ్ మరియు ఐఫోన్ కూడా ఉండాలి. ఈ పద్దతిలో మీ iPhone ను Mac బుక్ కు కేబుల్ ద్వారా కనెక్ట్ చేయాలి. కనెక్ట్ అయిన తరువాత, క్విక్ టైం అప్షన్ లోకి వెళ్ళి న్యూ ఆడియో రికార్డింగ్ ను ఎంచుకోవాలి. ఇక్కడ క్విక్‌టైమ్‌లోని రికార్డ్ బటన్ పక్కన, డౌన్ ఆరో క్లిక్ చేసి ఐఫోన్ ఎంపికను క్లిక్ చేయండి. తరువాత క్విక్ టైం లోని రికార్డ్ నొక్కండి. తరువాత, మీ ఐఫోన్ ద్వారా మీ ఇతర ఫోన్‌ WhatsApp కి కాల్ చేయండి.

కనెక్ట్ అయిన తర్వాత, మరొక ఫోన్‌లో కాల్‌ను స్వీకరించండి మరియు మీరు మాట్లాడాలనుకుంటున్న వ్యక్తిని జోడించండి. ఈవిధంగా,  కాల్స్ రికార్డ్ చేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo