SIM Binding అంటే ఏమిటి? ఇప్పుడు ఇది ఎందుకు ట్రెండ్ అవుతోంది.!

HIGHLIGHTS

ప్రస్తుతం SIM Binding అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది

కేవలం వినిపించడం మాత్రమే కాదు ఈ మాట గూగుల్ లో ట్రెండ్ గా మారింది

ఈ సిమ్ బైండింగ్ అంటే ఏమిటి మరియు ఇప్పుడు ఇది ఎందుకు ట్రెండ్ అవుతోందో ఒక లుక్కేద్దాం

ప్రస్తుతం SIM Binding అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. కేవలం వినిపించడం మాత్రమే కాదు ఈ మాట గూగుల్ లో ట్రెండ్ గా మారింది మరియు ఇదే మాట పై అనేక ఛానళ్లు విపరీతంగా న్యూస్ కూడా అందిస్తున్నాయి. అయితే, దీనికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది మరియు ఇది మరో రెండు రోజులు మాత్రమే వినిపించే అవకాశం ఉంది. మరి ఈ సిమ్ బైండింగ్ అంటే ఏమిటి మరియు ఇప్పుడు ఇది ఎందుకు ట్రెండ్ అవుతోందో ఒక లుక్కేద్దాం పదండి.

SIM Binding అంటే ఏమిటి?

ఒక మొబైల్ యాప్, బ్యాంక్ అకౌంట్ లేదా సర్వీస్‌ను ఒక నిర్దిష్ట SIM కార్డ్ (మొబైల్ నెంబర్) కు లింక్ చేసి లాక్ చేయడాన్ని SIM Binding అంటారు. ఇంకా వివరంగా చెప్పాలంటే, మీరు ఒక సర్వీస్‌ను ఉపయోగించాలంటే ఆ ఫోన్‌లో ఉన్న అదే SIM కార్డ్ ఉండాలి. ఒకవేళ SIM కార్డ్ మార్చితే లేదా మరో ఫోన్‌లో అదే అకౌంట్ లాగిన్ చేస్తే, సిమ్ వెరిఫికేషన్ మళ్లీ కచ్చితంగా అవసరం అవుతుంది.

SIM Binding ఎలా పనిచేస్తుంది?

మీరు యాప్‌లో మొబైల్ నంబర్ రిజిస్టర్ చేస్తారు. ఇలా చేయగానే యాప్ మీ సిమ్ కార్డ్ నుంచి ఒక SMS / OTP వెరిఫికేషన్ నిర్వహిస్తుంది. ఇలా వెరిఫికేషన్ నిర్వహించిన తరువాత ఆ యాప్ ఆ SIM కి బైండ్ అవుతుంది. ఇలా వెరిఫికేషన్ చేసిన సిమ్ కార్డు తీసేసినా లేదా మార్చినా, ఆ యాప్ పనిచేయక పోవచ్చు లేదా మళ్లీ రీ వెరిఫికేషన్ అడుగుతుంది.

ఎక్కువగా ఎక్కడ వాడుతారు?

  • బ్యాంకింగ్ యాప్‌లు
  • UPI యాప్‌లు
  • ఫైనాన్స్ / వాలెట్ యాప్‌లు
  • సెక్యూరిటీ అవసరమున్న సర్వీసులు

పైన తెలిపిన ప్రాంతాల్లో ఈ సర్వీస్ యూ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇలా చేయడం వలన అకౌంట్‌కు అదనపు భద్రత చేకూరుతుంది మరియు ఫ్రాడ్ ప్రమాదం తగ్గుతుంది.

Also Read: పవర్ ఫుల్ డ్యూయల్ సబ్ ఉఫర్ Dolby Soundbar అతి చవక ధరలో సేల్ అవుతోంది.!

SIM Binding ఎందుకు ట్రెండ్ అవుతోంది?

మార్చి 1, 2026 నుంచి భారతదేశంలో WhatsApp కోసం కూడా ఈ సిమ్ బైండింగ్ ను అమలు లోకి వచ్చింది. ఇది చాలా మంది యూజర్లకు తలనొప్పిగా మారె అవకాశం ఉంది. అందుకే, ఈ కొత్త పదం సడన్ గా పెద్ద ట్రెండ్ గా మారింది.

కేవలం ఇదే కాదు WhatsApp ఇప్పుడు ఈ SIM వాస్తవానికి ఫోన్‌లోనే ఉందో లేదో ప్రతి 6 గంటలకు చెక్ చేస్తుంది. ఒకవేళ సిమ్ కార్డు లేకుంటే లాగ్-అవుట్ చేస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :