ఓటరు కార్డులో ఫోటో, అడ్రస్ వివరాలను ఈజీగా సరిచేసుకోవచ్చు

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 23 Feb 2021
HIGHLIGHTS
  • ఓటర్ ఐడి లో ఫోటో అప్డేట్ చెయ్యాలా

  • ఓటర్ ఐడి కార్డులో అడ్రెస్స్ అప్డేట్ చేయాలా

  • ఓటర్ ఐడి కార్డులో ఆన్లైన్ అప్డేట్ గురిఞ్చి తెలుసా

ఓటరు కార్డులో ఫోటో, అడ్రస్ వివరాలను ఈజీగా సరిచేసుకోవచ్చు
ఓటరు కార్డులో ఫోటో, అడ్రస్ వివరాలను ఈజీగా సరిచేసుకోవచ్చు

మీ ధ్రువీకరణ పత్రాలు అన్ని కూడా ఒకే వివరాలతో ఉన్నాయా లేక ఏవైనా తప్పులు ఉన్నాయో గమనించడం మంచింది. ఒకవేళ మీకు ఇటువంటి ఇబ్బంది మీ ఓటరు కార్డులో తలెత్తితో చాలా సులభంగా మార్చుకోవచ్చు. ఇతర ద్రువీకర పత్రాలైన, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు అకౌంట్ పాస్ బుక్ మరియు ఇలాంటి మరిన్నివాటితో  ఈ ఓటరు కార్డు వివరాలు సరిపోలి ఉండక పోయినట్లయితే, ఇక్కడ నేనందించిన వివరాల ప్రకారంగా, చాల సులభ పద్దతిలో మీరే సొంతంగా మార్చుకోవచ్చు.

ఓటరు కార్డులో వివరాలను సరిచేసుకునే పద్దతి

1. https://www.nvsp.in పేజిలోకి ప్రవేశించాలి

2. ఇక్కడ మీరు అనేకరకాల ఎంపికలను చూడవచ్చు, కానీ మీరు మాత్రం కన్ను గుర్తుతో చూపిస్తున్న "Form-8" పైన నొక్కండి

3. ఇక్కడ మీరు పైన ఎడమ భాగంలో మీకు నచ్చిన భాషను ఎంచుకోండి.

4. ఇక్కడ మీరూ మీ రాష్ట్రము, తరువాత జిల్లా మరియు అసంబ్లీ లను ఎంచుకోండి

5. దాని క్రింద మీ వివరాలైనటువంటి, మీ పేరు మరియు ఇంటిపేరు ఇంగ్లీషులో రాయండి అది పక్కనున్న గళ్ళలో తెలుగులో వస్తుంది

6. ఇక్కడ మీరు అందించే వివరాలు Voter ID ఎలాగవున్నాయో అలానే వ్రాయండి

7. మీ ఎలక్ట్రోల్ నంబరు మరియు ఎలక్ట్రోల్ సీరియల్ నంబరు ఎంటర్ చేయండి

8. మీ EPIC(ఓటరు కార్డు నంబర్) నంబరు కూడా సూచించిన దగ్గర ఎంటర్ చేయండి

9. తరువాత "ఫోటోగ్రాఫ్"  అప్షన్ ఎంచుకొండి.   

9. ఇక్కడ (e) కాలంలో మీరు సరిచేసుకోవాల్సిన వివరాలకై సంబంధించిన బాక్స్ దగ్గర టిక్ చేయాలి (ఒక్క సారి మూడు బాక్స్ మాత్రమే టిక్ చేయవచ్చు)

10. మీరు టిక్ చేసిన బాక్సుల ప్రకారంగా వివరాలను నమోదు చేయండి (ఉదా : పేరు, అడ్రస్, వయసు, పుట్టిన తేది, మొదలగునవి)

12. చివరిన సూచించిన బాక్స్ లలో మీ ఈమెయిలు ID మరియు మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి

13.  ప్లేస్ బాక్సులో మీ ప్రాంతం మరియు Captcha బాక్సులో అందించిన ఇంగ్లీష్ అక్షరాలను పక్కనున్న పెట్టెలో ఎంటర్ చేసి "Submit"    చేయండి.           

గమనిక : ఈ ఫోటో సాఫ్ట్ కాపీ మాత్రమే అయ్యుండాలి                           

logo
Raja Pullagura

email

Web Title: voter id card photo and address update or change is very easy here is how
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status