కొత్త ఫోన్స్ లాంచ్ చెయ్యడానికి కొత్త ఫోన్స్ViVO సిద్దమవుతోంది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!!

కొత్త ఫోన్స్ లాంచ్ చెయ్యడానికి కొత్త ఫోన్స్ViVO సిద్దమవుతోంది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!!
HIGHLIGHTS

వివో ఇండియాలో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయబోతోంది

Vivo T1 Pro 5G మరియు Vivo T1 44W

కీలకమైన ఫీచర్లు మరియు స్పెషిఫికేషన్స్ ను కూడా కంపెనీ టీజర్ ద్వారా వెల్లడించింది

వివో ఇండియాలో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయబోతోంది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ల లాంచ్ గురించి కంపెనీ టీజింగ్ కూడా మొదలుపెట్టింది. అవే Vivo T1 Pro 5G మరియు Vivo T1 44W స్మార్ట్ ఫోన్లు. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ల యొక్క కీలకమైన ఫీచర్లు మరియు స్పెషిఫికేషన్స్ ను కూడా కంపెనీ టీజర్ ద్వారా వెల్లడించింది. త్వరలో రానున్న ఈ వివో స్మార్ట్ ఫోన్ల ఎటువంటి ఫీచర్లతో రానున్నాయి, అనే విషయం పైన ఒక లుక్ వేద్దామా.

Vivo T1 Pro 5G&T1 44W: అంచనా స్పెక్స్

వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Vivo T1 Pro 5G ను మే 4వ తేదీ మద్యహ్నం 12 గంటలకి ఇండియాలో విడుదల చేయడానికి డేట్ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 6nm ఫ్లాగ్ షిప్ అడ్వాన్స్డ్  ప్రాసెసర్ Snapdragon 778G తో తీసుకువస్తోంది. అంతేకాదు, వివో టి1 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ 66W టర్బో ఫ్లాష్  ఛార్జ్ సపోర్ట్ తో వస్తోంది. ఈ ఛార్జింగ్ టెక్ తో ఈ ఫోన్ కేవలం 18 నిముషాల్లోనే 50% వరకూ ఛార్జ్ చెయ్యగలదని కూడా వివో చెబుతోంది. Antutu బెంచ్‌మార్క్‌ని పరీక్షించడం కోసం 8GB RAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్‌ని ఫోన్‌లో ఉపయోగించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్ ఫోన్  Android 12 ఆధారిత Funtouch OS సాఫ్ట్‌వేర్‌ తో వస్తుందని ఆశిస్తున్నాము.

Vivo T1 Pro 5G abd Vivo T1 44W.jpg

ఇక Vivo T1 44W విషయానికి వస్తే, ఇది కొంచెం తక్కువ స్పెక్స్‌డ్ ఫోన్ అయినప్పటికీ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, బహుశా 5,000mAh బ్యాటరీ, స్నాప్‌ డ్రాగన్ 680 SoC, AMOLED స్క్రీన్ మరియు ఆండ్రాయిడ్ 12 ఆధారిత Funtouch OS వంటి ముఖ్యమైన అంశాలను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo