ఆదేశాలను జారీ చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
మార్చి 31 వ తేదీ ఆదివారం రావడంతో చివరిరోజు ఏమైనా కంప్లీట్ కానటువంటి లావాదేవీలను చేయడం ఎలాగ అని చూసేవారికి కొంచం ఇబ్బందిగా మారుతుందని గ్రహించిన RBI, 31 వ తేదీ ఆదివారం అయినా కూడా బ్యాంకులు పనిచేయాలని ఆదేశించింది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశానుసారం, అన్ని ప్రభుత్వ బ్యాంకులు కూడా రేపు తెరిచే ఉంటాయి. తమ లావాదేవిలను ఈ రోజువరకు ముగించడంలో విఫలమైనవారు, రేపు వారు ముగించుకునే అవకాశం దక్కుతుంది. ఈ సదవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
Surveyచాలా కంపెనీలు, వ్యాపారాలు మరియు ఉద్యోగస్తులు వారికీ సంబంధిన ఏవైనా పెండింగ్ పనులు ఉంటే గనుక RBI ఆదేశానుసారం ఆదివారం కూడా లావాదేవీలను చేయవచ్చు. కాబట్టి, ఆదివారం కూడా బ్యాంకు సిబ్బంది విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇది ఖఛ్చితంగా ఒక మంచి విషయంగా పరిగణించవచ్చు.
ఇప్పటివరకు ట్యాక్స్ కట్టనివారు ఈ మూడురోజుల వ్యవధిలో ముగుంచుకోవచ్చు. ఇప్పటివరకు, ఆదివారం సెలవు అవుతుందని శనివారం లోపుగానే ముగించాలి అని చింతిస్తున్నవారికి, కొంత ఊరట ఈ వార్త ద్వారా కలుగుతుంది. అలాగే, ఇప్పటి వరకు తమ PAN కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి కూడా 3 రోజుల గడువు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు మీరు గనుక మీ PAN కార్డుతో ఆధార్ గనుక లింక్ చేయకుంటే, ఇక్కడ మ్మంధించి వివరాలతో కేవలం ఒక్క SMS తో లింక్ చేయవచ్చు.
పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించడానికి, ఆదాయ పన్ను శాఖ కొత్త ఎస్ఎమ్ఎస్ సేవను ప్రారంభించింది. దీని కోసం మీ UIDPAN అని టైప్ చేసిన తరువాత స్పేస్ ఇచ్చి మీ ఆధార్ నంబరును ఎంటర్ చేసి ఈ SMS ను 561667 నంబరుకు లేదా 56161 కు పంపాలి. UIDPAN<స్పెస్><ఆధార్ నంబర్><స్పేస్><పాన్ నంబర్> ఈ ఫార్మాట్ లో 561667 నంబరుకు లేదా 56161 కు పంపాలి. అదనంగా, ఇ-ఫైలింగ్ వెబ్సైట్ విభాగానికి ఇది అనుసంధానించబడుతుంది.
ఉదాహరణ : UIDPAN 123456123456 ABCDF2019A