ఈరోజు జరగనున్న HMD గ్లోబల్ యొక్క నోకియా ఫోన్ల లాంచ్ ఈవెంట్ వాయిదా పడింది

ఈరోజు జరగనున్న HMD గ్లోబల్ యొక్క నోకియా ఫోన్ల లాంచ్ ఈవెంట్ వాయిదా పడింది
HIGHLIGHTS

ఈరోజు జరిగించనున్న ఈవెంట్ ను వాయిదా వేసినట్లు కంపెనీ ప్రకటించింది

ముందుగా,  సెప్టెంబర్ 11 న జరగనున్న ప్రత్యేక కార్యక్రమానికి కంపెనీ తరపున మీడియాకు ఇన్‌వాయిస్‌లు అందించింది. ఈ కార్యక్రమం ద్వారా, కంపెనీ నోకియా 7.2, నోకియా 6.2, నోకియా 5.2 ఫోన్‌లను విడుదల చెయ్యవచ్చని అందరూ భావించారు. అంతేకాదు, ఈ ఫోనులు ఆండ్రాయిడ్ 9 పై తో ప్రారంభించబడతాయి, అయితే, ఈ ఫోన్లు ఈ సంవత్సరం చివరి నాటికల్లా ఆండ్రాయిడ్ 10 కి అప్డేట్ చేయబడతాయి అని కూడా అంచనా వేశారు. ఎందుకంటే, నోకియా తన స్మార్ట్ ఫోన్ల యొక్క ఆండ్రాయిడ్ 10 రోడ్ బ్లాక్ అందించడమే ఇందుకలు కారణంగా చెప్పొచ్చు.  

అయితే, ఈ నోకియా ఈరోజు జరిగించనున్న ఈవెంట్ ను వాయిదా వేసినట్లు కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన అప్డేట్ డేట్ ను కూడా ప్రకటించలేదు మరియు త్వరలోనే ఈ డేట్ యొక్క అప్డేట్ అందంచనున్నట్లు తెలిపింది. అయితే, ఈ ఈవెంట్ ను ఎందుకు వాయిదా వేసిందో, అందుకు తగిన కారణాలను కూడా తెలియపరచలేదు. కానీ, ఇటీవల IFA లో లాంచ్ చేసినటువంటి స్మార్ట్ ఫోన్లతో పాటుగా మరికొన్ని స్మార్ట్ ఫోన్లను కూడా ఈ ఈవెంట్ ద్వారా లాంచ్ చెయ్యడానికి HMD గ్లోబల్ ఆలోచిస్తునట్లు ఊహిస్తున్నారు.         

ఈ నోకియా 6.2 కు ఒక 6.18-అంగుళాల 18.7: 9 ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లే 2340 × 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో లభిస్తుంది. ఈ మొబైల్ ఫోన్‌కు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 చిప్‌సెట్ ఉంటుంది మరియు ఈ ఫోన్ 4 జిబి మరియు 6 జిబి ర్యామ్ మరియు 64 జిబి మరియు 128 జిబి స్టోరేజ్ తో లభిస్తాయి. ఈ ఫోన్ వెనుక ప్యానెల్‌లో 48 MP కెమెరా అందుబాటులో ఉంటుంది మరియు ఈ ఫోన్‌లో 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించబడుతుంది, ఇది క్వాల్‌కామ్ యొక్క క్విక్ ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది.

ఇక నోకియా 7.2 యొక్క స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే, ఈ ఫోన్‌కు స్నాప్‌డ్రాగన్ 710 చిప్‌సెట్ లభిస్తుంది మరియు ఇది 6 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్‌తో జతచేయబడుతుంది. ఈ మొబైల్ ఫోన్‌లో 48 MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను చూడవచ్చు మరియు ఈ ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందుబాటులో ఉంటుంది. ఒక ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్ బటన్‌తో ఈ ఫోన్ తీసుకురాబడుతుంది మరియు 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వబడుతుంది. మొబైల్ ఫోన్‌లో హైబ్రిడ్ సిమ్ కార్డ్ స్లాట్ కూడా ఇవ్వబడుతుంది.

ఈ కార్యక్రమంలో ప్రారంభించబోయే మూడవ ఫోన్ నోకియా 5.2, ఇది స్నాప్‌డ్రాగన్ 632 చిప్‌సెట్ ద్వారా శక్తినివ్వనుంది.

ఈ మూడు పరికరాల ధరలు ఇంకా తెలియలేదు, అయితే ఈ ఫోన్‌ల ధర నోకియా 5.1, నోకియా 6.1 మరియు నోకియా 7.1 ధరలకు దగ్గరగా  ఉంటుందని అంచనా. ఈ మూడు ఫోన్లు వాటర్‌డ్రాప్ నాచ్‌తో తీసుకురాబడతాయి, అయితే, ఈ ఫోన్‌ల యొక్క ఫీచర్లు ఇంకా నిర్ధారించబడలేదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo