ఈ iPhone ధరలను భారీగా తగ్గించిన యాపిల్..!

HIGHLIGHTS

Apple కొన్ని ఐఫోన్ ల ధరలను భారీ నుండి అతిభారీగా తగ్గించింది

భారతదేశంలో యాపిల్ తన కొత్త ఐఫోన్ మోడళ్లను విడుదల చేసిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది

ఐఫోన్ 13 పైన 10,000 వేల రూపాయలు భారీ తగ్గింపు

ఈ iPhone ధరలను భారీగా తగ్గించిన యాపిల్..!

Apple కొన్ని ఐఫోన్ ల ధరలను భారీ నుండి అతిభారీగా తగ్గించింది. భారతదేశంలో యాపిల్ తన కొత్త ఐఫోన్ మోడళ్లను విడుదల చేసిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల యాపిల్ ప్రకటించిన iPhone 14 మరియు iPhone 14 Pro సిరీస్ ను ప్రారంభించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. కేవలం ధరలను తగ్గించడమే కాదు కొన్ని ఐఫోన్ మోడళ్లను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కూడా వెల్లడించింది. మరి యాపిల్ భారీగా ధర తగ్గించిన ఈ ఐఫోన్ మోడళ్ళు గురించి తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ముందుగా, ఐఫోన్ 14 లైనప్‌ రాకతో ఆగిపోనున్న ఐఫోన్ల గురించి ముందుగా తెలుసుకుందాం. 14 ప్రో మాక్స్‌తో పాటు ఐఫోన్ 14 ప్రో కొత్త ప్రో సిరీస్ ఫోన్లను లాంచ్ చేసిన తరువాత గత సంవత్సరం తీసుకొచ్చిన ప్రో ఫోన్లయిన iPhone 13 Pro మరియు iPhone 13 Pro Max లను తొలగించింది. అంటే, ఈ రెండు ఫోన్లు కూడా ఇకపై యాపిల్ స్టోర్ నుండి అందుబాటులో ఉండవు. అంతేకాదు, 13 Pro ఫోన్లతో పాటు, Apple లైనప్ నుండి iPhone 11 మరియు iPhone 12 mini లను కూడా తీసివేసింది.

ఇక Apple iPhone 14 ఫోన్ల లాంచ్ తరువాత ధర తగ్గినా ఫోన్ల విషయానికి వస్తే, iPhone 13 ఇప్పుడు 69,900 నుండి ప్రారంభమవుతుంది. అలాగే, 13 మినీ ధర రూ.64,900 నుండి, iPhone SE (2022) ధర రూ.49,900 నుండి మరియు iPhone 12 యొక్క ధర రూ.59,900 నుండి ప్రారంభమవుతుంది. అంటే, లాంచ్ సమయంలో వచ్చిన ధరలతో పోలిస్తే ఐఫోన్ 13 పైన 10,000 వేల రూపాయలు మరియు 12 పైన 20 వేల రూపాయల వరకూ తగ్గింపును చూడవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo