Driving Licence కోసం అప్లై చేస్తున్నారా.. మీకోసం గుడ్ న్యూస్..!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 15 Apr 2022 | అప్‌డేట్ చేయబడింది పైన 28 May 2022
HIGHLIGHTS
  • డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసే వారికి మంచి రోజులు

  • భుత్వ కొత్త నియమాలతో ఉపశమనం

  • చాలా సులభంగా మరియు శీఘ్రంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు

Driving Licence కోసం అప్లై చేస్తున్నారా..  మీకోసం గుడ్ న్యూస్..!
Driving Licence కోసం అప్లై చేస్తున్నారా.. మీకోసం గుడ్ న్యూస్..!

కొత్తగా తీసుకొచ్చిన నియమాల ప్రకారం, ఏదైనా గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్ నుండి డ్రైవింగ్ లైసెన్స్ పొందడం కోసం నమోదు చేసుకోవచ్చు. ప్రభుత్వం తీసుకోచ్చిన కొత్త నియమాలతో డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసే వారికి మంచి రోజులొచ్చాయని చెప్పవచ్చు. వాస్తవానికి, ముందుగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఉన్న కఠినమైన నియమాల నుండి ప్రభుత్వ కొత్త నియమాలతో ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు, చాలా సులభంగా మరియు శీఘ్రంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. మరింత సౌకర్యమైన విషయం ఏంటంటే, దీనికోసం మీరు RTO ఆఫీస్ కు కూడా వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు.

కొత్తగా లైసెన్స్ కోసం అప్లై చేసే లెర్నర్స్ తమ లైసెన్స్ కోసం అర్హత సాధించడానికి ఏదైనా గుర్తింపు పొందిన డ్రైవర్ స్కూల్ కేంద్రాలలో శిక్షణ పొందాలి. మీరు డ్రైవింగ్ స్కూల్ నుండి డ్రైవింగ్ టెస్ట్ ను విజయవంతంగా పూర్తిచేయగాలిగితే, డ్రైవింగ్ లైసెన్స్ కోసం RTO (ప్రాంతీయ రవాణా కార్యాలయం) నుండి డ్రైవింగ్ టెస్ట్ నుండి మీకు మినహాయింపు ఉంటుంది.

అయితే, గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్స్ మరియు గుర్తింపు పొందిన ఏజెన్సీలు ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలు మరియు తేలికపాటి మోటారు వాహనాల శిక్షణా కేంద్రాలకు కనీసం ఒక ఎకరం భూమి ఉండేలా చూడాలి. అదేవిధంగా, భారీ వాహనాలు మరియు కార్గో ట్రక్కుల ట్రైనింగ్ స్కూల్స్ కు 2 ఎకరాల స్థలం అవసరం .ఇంకో ముఖ్యమైన అవసరం ఏమిటంటే, ఎగ్జామినర్ కనీసం 12 తరగతి పాస్‌ కలిగి ఉండాలి .డ్రైవింగ్ స్కూల్స్ కి ఇలాంటి అనేక షరతులు ఉన్నాయి.

డ్రైవింగ్ లైసెన్స్ ఆన్‌లైన్‌ లో ఎలా పొందాలి?

1. RTO వద్ద ఫిజికల్ టెస్ట్ కి బదులుగా, ఇప్పుడు మీరు ఆన్‌లైన్ టెస్ట్ కోసం హాజరుకావచ్చు.

2. ఆన్‌లైన్ టెస్ట్ ఆడిట్ కోసం ఎలక్ట్రానికల్ గా రికార్డ్ చేయబడుతుంది.

3. భారతీయ రహదారి రంగంలో మంచి డ్రైవర్ల కొరత కారణంగా కొత్త నిబంధనలు అమలు చేయబడ్డాయి. ఇది రహదారి నిబంధనలపై అవగాహన లేకపోవడం వల్ల చాలా ప్రమాదాలకు కారణమవుతుంది.

4. డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో లొసుగులను తగ్గించడానికి దరఖాస్తుదారుల ఆన్‌లైన్ పరీక్ష అమలు చేయబడుతోంది.

5. ఆన్‌లైన్ డ్రైవింగ్ టెస్ట్ ఫిజికల్ డ్రైవింగ్ టెస్ట్ కంటే సమర్థవంతంగా ఉంటుందని భావిస్తున్నారు.

6. డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా మరియు సమర్థవంతంగా చేస్తుంది.

7. డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత, అది ఆటొమ్యాటిగ్గా సంబంధిత మోటారు వాహన లైసెన్స్ అధికారికి చేరుకుంటుంది.   

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: These are the new rules for apply driving license
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Kuvadiya Sales Magnetic Vibra Plus Head Massager Hairbrush with Double Speed in Treatment | hair massager
Kuvadiya Sales Magnetic Vibra Plus Head Massager Hairbrush with Double Speed in Treatment | hair massager
₹ 140 | $hotDeals->merchant_name
HP 15.6 LAPTOP BAG Backpack  (Black, Black, 25 L)
HP 15.6 LAPTOP BAG Backpack (Black, Black, 25 L)
₹ 275 | $hotDeals->merchant_name
Vadhavan Roller Anti Aging 100% Natural Jade Facial Roller healing Slimming Massager Anti Aging 100% Natural Jade Facial Roller healing Slimming Massager Massager  (Green)
Vadhavan Roller Anti Aging 100% Natural Jade Facial Roller healing Slimming Massager Anti Aging 100% Natural Jade Facial Roller healing Slimming Massager Massager (Green)
₹ 175 | $hotDeals->merchant_name
IRIS Fitness Leg and Foot Massager  (Red)
IRIS Fitness Leg and Foot Massager (Red)
₹ 10999 | $hotDeals->merchant_name
AGARO 33511 MAGMA Air compression leg massager with handheld controller, 3 massage mode and intensity for feet, calf and thigh Massager  (Black)
AGARO 33511 MAGMA Air compression leg massager with handheld controller, 3 massage mode and intensity for feet, calf and thigh Massager (Black)
₹ 6199 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status