తెలంగాణా రేషన్ కార్డ్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్..!!
తెలంగాణాలో ఉచిత బియ్యం పంపిణి
గుడ్ న్యూస్ అందించిన తెలంగాణ ప్రభుత్వం
ఈ నెల నుండి ఈ ఉచిత బియ్యం సరఫరా ప్రారంభం
తెలంగాణాలో ఉచిత బియ్యం పంపిణి చేపట్టనున్నట్లు రేషన్ కార్డ్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అందించిన తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల నుండి ఈ ఉచిత బియ్యం సరఫరా రేషన్ షాపుల్లో ప్రారంభిస్తునట్లు మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. రేషన్ కార్డ్ లిమిట్ తో పనిలేకుండా ఒక్కొక్కరికి 10 (5+5) కిలోల చొప్పున రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి బియ్యాన్ని పంపిణి చేస్తామని పేర్కొన్నారు. జూన్ నుండి డిసెంబర్ నెల వరకూ కూడా ఈ ఉచిత రేషన్ పంపిణీ కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
Surveyమీరు మీ రేషన్ కార్డ్ ను ఉపయోగించి దేశంలో ఏ ప్రాంతం నుండైనా మీ రేషన్ తీసుకునే అవకాశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం మీకు అందించింది. దీని కోసం, మీకు తగిన సహాయాన్ని అందించడానికి ఉపయోగపడేలా మేరా రేషన్ యాప్ ను కూడా అందించింది. దీని ద్వారా మీ దగ్గరలోని రేషన్ షాప్ వివరాలను మీ స్మార్ట్ ఫోన్ లోనే తెలుసుకోవచ్చు.
ఈ యాప్ ద్వారా రేషన్ లభిధారులు దేశంలో ఎక్కడి నుంచైనా సరే తమ రేషన్ తీసుకోవచ్చు. అంతేకాదు, రేషన్ లభిధారుల దగ్గరలోని రేషన్ షాప్ మరియు దాని వివరాలను కూడా పొందవచ్చు. మేరా రేషన్ యాప్ పేరుతో వచ్చిన ఈ యాప్ రేషన్ కార్డు లబ్ధిదారులకు వరంలా మారుతుంది.రేషన్ కార్డు వున్న ప్రతి ఒక్కరికి రేషన్ అందేలా చూసేందుకు ప్రభుత్వం ఈ 'మేరా రేషన్' మొబైల్ యాప్ ను తీసుకొచ్చింది.
మేరా రేషన్ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ప్లే స్టోర్ నుండి అందుబాటులో వుంది మరియు దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మీ దగ్గర్లోని రేషన్ షాప్ వివరాలను తెలుసుసుకోవడమే కాకుండా రేషన్ సామునుల ధర వివరాలు కూడా తెలుసుకోవచ్చు. UMANG లో ఈ యాప్ సర్వీస్ లన్ని లభిస్తున్నాయి. కాబట్టి, మీ వద్ద UMANG App వున్నా కూడా ఈ యాప్ అందించే లాభాలను పొందవచ్చు.
మేరా రేషన్ మొబైల్ యాప్
ఈ యాప్ ను ఉపయోగించాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేయాలి. అందుకే, ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా, గూగుల్ ప్లే స్టోర్ నుండి మేరా రేషన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. తరువాత, మీ రేషన్ కార్డు నంబర్ తో రిజిష్టర్ చేసుకోవాలి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile