అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి భారీ ఆఫర్లతో Tecno Spark 9T ఫస్ట్ సేల్.!!
Tecno Spark 9T బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ కి రానుంది.
చవక ధరలో బిగ్ FHD+ డిస్ప్లే మరియు బిగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్లతో వచ్చింది
అమెజాన్ సేల్ నుండి మొదటిసారి సేల్ కి వస్తూనే భారీ ఆఫర్లను తీసుకువస్తుంది
టెక్నోఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన Tecno Spark 9T బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ కి రానుంది. అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి భారీ ఆఫర్లతో Tecno Spark 9T ఫస్ట్ సేల్ జరగనున్నది. టెక్నో ఈ స్మార్ట్ ఫోన్ ను చవక ధరలో బిగ్ FHD+ డిస్ప్లే మరియు బిగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్లతో అందించింది. అయితే, అమెజాన్ సేల్ నుండి మొదటిసారి సేల్ కి వస్తూనే భారీ ఆఫర్లను తీసుకువచ్చింది.
SurveyTecno Spark 9T: ధర
Tecno Spark 9T స్మార్ట్ ఫోన్ 4GB ర్యామ్ మరియు 64 ఇంటర్నల్ స్టోరేజ్ తో కేవలం రూ.9,299 రూపాయల ధరతో లాంచ్ చెయ్యబడింది. ఆగష్టు 6 నుండి అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి మొదటిసారి అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్ నుండి SBI క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
Tecno Spark 9T: స్పెక్స్
టెక్నో స్పార్క్ 9టి స్మార్ట్ ఫోన్ 6.6-ఇంచ్ FHD+ డిరిజల్యూషన్ కలిగిన LCD ప్యానల్ ను కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 500 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G35 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 4GB ర్యామ్ కి జతగా 64GB స్టోరేజ్ కూడా జత చేయబడుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ DTS స్టీరియో సౌండ్ మరియు IPX2 స్ప్లాష్ రెసిస్టెన్స్‌ని కూడా కలిగి ఉంది.
కెమెరాల విభాగంలో, టెక్నో స్పార్క్ 9టి లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP ప్రధాన కెమెరాకి జతగా 2MP పోర్ట్రైట్ కెమెరా మరియు AI లెన్స్ కూడా ఉంటుంది. సెక్యూరిటీ పరంగా, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వుంది. ఈ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 11OS తో HiOS 7.6 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది. టెక్నో స్పార్క్ 9టి రెగ్యులర్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile