తిరుపతిలో అధునాతన టీవీ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్న TCL :నివేదిక

తిరుపతిలో అధునాతన టీవీ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్న TCL :నివేదిక
HIGHLIGHTS

ఈ చైనా యొక్క ఎలక్ట్రానిక్స్ కంపెనీ స్మార్ట్ టీవీ తయారీ కేంద్రాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయనుంది.

భారతదేశంలో రోజు రోజుకి పెరుగు తున్న మార్కెట్ ని అందిపుచ్చుకోవాలని ఇప్పుడు చాల కంపెనీలు ఆలోచిస్తున్నాయి. ఈ బాటలో ప్రస్తుతం, చైనా యొక్క కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయిన TCL ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోని తిరుపతిలో తన టీవీ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. ఈ మ్యానిఫేక్చేరింగ్ యూనిట్ ద్వారా తన స్మార్ట్ టీవీ లను ఇక్కడ తయారీచేయాలనీ కంపెనీ భావిస్తుంది. ఇదే గనుక నిజమైతే, భారతదేశ ప్రామాణ్యతకి మరియు ధరకి అనువుగా వుండే టీవీలను మనము పొందే అవకాశముంటుంది.

TCL సంస్థ, తన బలమైన ఛానల్ నెట్వర్క్ తో 160 అంతర్జాతీయ మార్కెట్ల ద్వారా దాదాపుగా 80 దేశాలలో తన ఉనికిని చాటుతుంది. 2018 ప్రధమార్ధంలో, ఈ కంపెనీ యొక్క గ్లోబల్ LCD అమ్మకాలు దాదాపుగా 1 కోటి 30 లక్షల అమ్మకాల మార్క్ ని చేరుకున్నాయి, ఇది గడచిన సంవత్సరం కంటే 37.2% అధికం. " ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాకున్న భాగస్వామ్యంతో తిరుపతిలో ఏర్పాటుచేయనున్న ఈ తయారీ యూనిట్ ద్వారా ప్రస్తుత తాజా కటింగ్ – ఎడ్జ్ సాంకేతికతతో భారతీయ వినియోగదారులకి ఇన్నోవేటివ్ స్మార్ట్ టివిలైన QLED మరియు AI సాంకేతికతను అందిస్తామని" TCL ఇండియా యొక్క  దేశీయ అధికారి అయిన, మైక్ చెన్ తెలిపారు.          

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo