ఈ Anti-Bacterial LED బల్బు మీ ఇంట్లో ఉంటే బాక్టీరియా పని అయిపోయినట్లే

ఈ Anti-Bacterial LED బల్బు మీ ఇంట్లో ఉంటే బాక్టీరియా పని అయిపోయినట్లే
HIGHLIGHTS

సరికొత్త బ్యాక్టీగ్లో SSK-BAB-9W Anti-Bacterial LED బల్బును తీసుకొచ్చింది.

LED లైట్ టెక్నాలజీలో అత్యంత ప్రాచూర్యం పొందిన, Syska మైక్రోబయాల్ డిసిన్ఫెకషన్ లక్షణాలను కలిగి, విద్యుత్ ద్వారా గదిలోని హానికరమైన బాక్టీరియాను నశింపచేసే సరికొత్త బ్యాక్టీగ్లో SSK-BAB-9W  Anti-Bacterial LED బల్బును తీసుకొచ్చింది. ఈ బల్బు, 400nm నుండి 420nm  తరంగ ధైర్ఘ్యము ( wavelength) ను విడుదల చేస్తుంది మరియు  ఇది మనుష్యులకు ఎటువంటి హాని కలిగించదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

 హానికరమైన బాక్టీరియాను ఎదుర్కోవడానికి మరియు విస్తరించకుండా నిరోధించాడనికి సాంకేతిక పరంగా తీసుకొచ్చిన వాటిలో, అత్యాధునిక టెక్నజితో నిర్మించిన ఈ బ్యాక్టీగ్లో Anti-Bacterial LED బల్బును కూడా ఒక ప్రధానమైనదానిగా చెప్పవచ్చు. దీన్ని ఈ గదిలోనైతే ఉంచుతారో, ఆ గదిలో వున్న చాలా రకాలైన హానికారక బ్యక్టీరియాలను దాదాపుగా నశింపచేస్తుంది.

అలాగే, ఈ బ్యాక్టీగ్లో LED బల్బ్ 2-ఇన్-1 మోడ్ తో వస్తుంది. దీన్ని మీరు లైట్ ప్లస్ యాంటీ-బ్యాక్టీరియల్ మోడ్ లేదా కేవలం యాంటీ బ్యాక్టీరియల్ మోడ్ తో ఎంచుకునేలా వస్తుంది.  ఈ ప్రత్యేకమైన , యాంటీ-బ్యాక్టీరియల్ బల్బ్ కేవలం 250/- రుపాయల ఆకర్షణీయమైన ధరతో విడుదల చెయ్యబడింది. అలాగే, ఈ LED బల్బ్ దేశవ్యాప్తంగా వున్న ప్రధానమైన రిటైల్ స్టోర్లలో లభిస్తుంది మరియు ఈ LED బల్బ్ 1 సంవత్సరం వారంటీతో పాటుగా వస్తుంది.                               

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo