New Scam: కార్డు లేదా OTP తో కూడా పని లేకుండా అకౌంట్ ఖాళీ చేస్తున్న స్కామర్లు.!
దేశంలో మరో కొత్త స్కామ్ పుట్టుకొస్తోంది
కొత్త స్కామ్ తో ఏకంగా కార్డు లేదా OTP తో కూడా పని లేకుండా అకౌంట్ ఖాళీ
ఇలాంటి స్కామ్స్ నుంచి మీరు జాగ్రత్తగా ఉండడానికి టిప్స్
New Scam: ఒక స్కామ్ ముగిసింది అని ఊపిరి పీల్చుకునే లోపలే దేశంలో మరో కొత్త స్కామ్ పుట్టుకొస్తోంది. డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజల అకౌంట్ ఖాళీ చేసే వారికి ప్రజలు మరియు ప్రభుత్వం కలిసి కట్టుగా చెక్ పెట్టారు. అయితే, ఈ స్కామ్ మెల్లగా సమసిపోయే దశకు చేసుకోగా, ఇప్పుడు మరో కొత్త స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త స్కామ్ తో ఏకంగా కార్డు లేదా OTP తో కూడా పని లేకుండా అకౌంట్ ఖాళీ చేస్తున్నారు.
Surveyఏమిటి ఈ New Scam?
ఝార్ఖండ్ రాష్ట్రంలో ఒక మహిళకు తెలియకుండా ఆమె అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసిన వార్తతో ఈ కొత్త స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఝార్ఖండ్ లోని గఢ్వా జిల్లాలో ఈ ఘటన జరిగింది. వ్యవసాయదారుల లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అందించిన PM KishanYojana పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తాయని నమ్మించిన సదరు స్కామర్లు ఆ మహిళ రెటీనా స్కాన్ తీసుకున్నారు. దీని ద్వారా ఆ మహిళ అకౌంట్ లో ఉన్న 10,000 రూపాయలు విత్ డ్రా చేశారు. ఈ డబ్బులు విత్ డ్రా చేయడానికి కార్డు లేదా OTP కూడా అవసరం లేకుండానే పని కానిచ్చేశారు.
ఈ స్కామ్ ఎలా సాధ్యం అయ్యింది?
ప్రస్తుతం అన్ని బ్యాంక్స్ కూడా యూజర్ అకౌంట్ ను వారి ఆధార్ నెంబర్ తో జత చేస్తున్నాయి. ఇలా లింక్ చేయడం ద్వారా బయోమెట్రిక్ స్కాన్ ఉపయోగించి అకౌంట్ నుంచి డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే, ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదా రెటీనా స్కాన్ తో డబ్బు తీసుకునే వీలుంది. అందుకే, స్కామర్లు సదరు మహిళకు ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం ఆశ చూపించి రెటీనా స్కాన్ తీసుకున్నారు. స్కాన్ ద్వారా ఆమె ఆధార్ తో లింక్ అయిన అకౌంట్ వివరాలు తెలుసుకున్నారు. అదే సమయంలో ఆ మహిళ అకౌంట్ నుంచి రూ. 10,000 రూపాయలు కూడా విత్ డ్రా చేసుకున్నారు.

ఇవేమి తెలియని ఆ మహిళ తర్వాత రోజు బ్యాంకు వెళ్ళినప్పుడు తాను మోసపోయిన విషయం తెలుసుకుంది. అయితే, ఈ ఆధార్ కార్డు క్యాష్ విత్ డ్రా కోసం రూ. 10,000 రూపాయలు గరిష్ట లిమిట్ కాబట్టి అంత కంటే ఎక్కువ మొత్తం విత్ డ్రా చేయడం కుదరలేదు. లేదంటే, సదరు మహిళ అకౌంట్ పూర్తిగా ఖాళీ అయ్యుండేది.
Also Read: Digital Ration Card అంటే ఏమిటి మరియు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో వివరంగా తెలుసుకోండి.!
ఇలాంటి స్కామ్స్ నుంచి మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి?
తెలియని వారిని నమ్మి మీ OTP లేదా మరింకేదైనా సున్నితమైన డేటా షేర్ చేయకండి. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే WhatsApp మెసేజ్, ఫోన్ కాల్స్, SMS, లేదా ఇమెయిల్ నమ్మకండి. వాటిని ఓపెన్ చేయకపోవడం మరింత ఉత్తమం. ప్రభుత్వ పథకాల ముసుగులో కొత్త మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా OTP మరియు ఆధార్ బయోమెట్రిక్ స్కాన్ తో మోసాలు చేస్తున్నారు. కాబట్టి, వీటికి దూరంగా ఉండండి మరియు అవసరమైతే మీ దగ్గరలోని ప్రభుత్వ కార్యాలయాన్ని దర్శించండి. వాస్తవానికి, ప్రభుత్వ పథకాలు ఇలాంటి వివరాలు అడగవు.
బ్యాంకు ఉద్యోగి లేదా ప్రభుత్వ ఉద్యోగి అంటూ ఎవరైనా మీ ఇంటికి వస్తే నమ్మవద్దు. హెల్ప్ లైన్ కు కాల్ చేయడం లేదా దగ్గరలోని ప్రభుత్వ కార్యాలయాన్ని సంప్రదించండి. నేటి కలికాలంలో మోసం చేయడం ఆటగా మారింది కొందరికి. కానీ, మీరు ఆ ఆటలో బలిపశువు కాకుండా చూసుకోండి. దీనికోసం మరింత జాగ్రత్త వహించడం మంచిది. ముఖ్యంగా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.