మీరు SBI అకౌంట్ వాడుతున్నారా .. మీ ఫోన్ లో ఈ Apps వాడవద్దు..!

HIGHLIGHTS

SBI వినియోగదారులు వారి మొబైల్ ఫోన్లలో ఉపయోగించకూడని యాప్స్

ఈ యాప్స్ ని SBI కస్టమర్లు వారి ఫోన్లలో వాడకపోవడం మంచిది

సరైన అధికారిక వెబ్ సైట్ ను మాత్రమే సందర్శించండి

మీరు SBI అకౌంట్ వాడుతున్నారా .. మీ ఫోన్ లో ఈ Apps వాడవద్దు..!

 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చాలా కాలంగా తమ బ్యాంక్  కస్టమర్లను కొన్నియాప్స్ విషయంగా హెచ్చరిస్తూ వస్తోంది. అంటే, SBI కస్టమర్లు వారి ఫోన్లలో వాడే యాప్స్ పరంగా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. అంతేకాదు, గతంలో చాలా అలర్ట్ లను కూడా జారీ చేసింది. SBI వినియోగదారులు వారి మొబైల్ ఫోన్లలో ఉపయోగించకూడని కొన్ని యాప్స్ గురించి హెచ్చరికాలు కూడా జారీచేసింది. వాటిలో ముఖ్యమైనని ఒక 4 యాప్స్ వున్నాయి మరియు గతంలో ఈ యాప్స్ వాడిన కారణంగా 150 మందికి పైగా ఖాతాదారులు 70 లక్షలకు పైగా పోగొట్టుకున్నట్లు కూడా తెలిపింది. అందుకే, అటువంటి యాప్స్ ని SBI కస్టమర్లు వారి ఫోన్లలో వాడకపోవడం మంచిది.   

Digit.in Survey
✅ Thank you for completing the survey!

విషయం ఏమిటంటే, మోసపూరితమైన లేదా వాటికీ అవకాశం ఇచ్చే కొన్ని యాప్స్ వలన నష్టపోతున్న తన ఖాతాదారులను దృష్టిలో ఉంచుకొని, ఎనిడెస్క్ (Anydesk), క్విక్ సపోర్ట్ (Quick Support), టీమ్ వ్యూవర్ (Teamviewer) మరియు మింగిల్ వ్యూ (Mingleview) యాప్ లను ఇన్స్స్టాల్ చేసుకోవద్దని SBI తన కస్టమర్లను హెచ్చరించింది.

అంతేకాదు, ఏదైనా గుర్తుతెలియని ఒరిజిన్ నుండి ఏదైనా UPI కలెక్ట్ రిక్వెస్ట్ లేదా QR Code వస్తే వాటిని వాటిని స్వీకరించడం లేదా ఆమోదించడం వంటిని చేయవద్దని కూడా తెలిపింది

అలాగే, SBI వెబ్ సైట్ నుండి హెల్ప్ లైన్ కోసం వెతికేప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే, ఆన్లైన్లో ఆరు కంటే పైచిలుకు నకిలీ SBI వెబ్ సైట్స్ ఉన్నాయి. అందుకే, ఏదైనా పరిస్కారం కోసం సంప్రదించవలసిన సమయంలో సరైన అధికారిక వెబ్ సైట్ ను మాత్రమే సందర్శించండి

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo