sarthak pds public distribution system technology upgrade
SARTHAK PDS : భారత ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా నెట్ వర్క్ గా గుర్తింపు పొందింది. ఈ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అదే SARTHAK-PDS (స్కీమ్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ రేషన్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హ్యాండ్లింగ్ ఇన్కమ్ విత్ ఆటోమేషన్ ఇన్ PDS) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త పథకాన్ని 2026 నుంచి 2031 వరకు సుమారు రూ. 25,530 కోట్ల వ్యయంతో అమలు చేయడానికి ప్రణాళిక చేసింది.
రేషన్ పంపిణీ వ్యవస్థను డిజిటల్ సాంకేతికతతో ఆధునికీకరించడమే ఈ కొత్త సార్థక్ PDS పథకం. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML), బ్లాక్ చైన్, డేటా అనలిటిక్స్, నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ (NLP) వంటి అత్యాధునిక సాంకేతికతలను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా ఆహార ధాన్యాల సరఫరా చైన్ (Supply Chain) రియల్ టైమ్ లో పర్యవేక్షిండానికి అవకాశం ఉంటుంది. అంటే, ఇది పూర్తిగా సెంట్రల్ నెట్ వర్క్ తో పని చేసే డిజిటల్ సిస్టం అన్నమాట.
ఈ పథకంలో ప్రతి దశలో కూడా ధాన్యాల కదలికను ట్రాక్ చేసే ఎండ్ టు ఎండ్ డిజిటల్ మానిటరింగ్ సిస్టం ఏర్పాటు చేయబడుతుంది. ఈ కొత్త సిస్టం తో గిడ్డంగుల నుంచి రేషన్ షాపుల వరకు ధాన్యాల రవాణా సమాచారాన్ని డిజిటల్ గా నమోదు చేయడం వల్ల లీకేజీలు, అక్రమ మళ్లింపులు పూర్తిగా అరికట్టే అవకాశం ఉంటుంది. అంటే, రేషన్ సమానులు దారితప్పే లేదా దళారుల చేతిలో పడకుండా అడ్డుకోవచ్చు.
సార్థక్ PDS పథకం వల్ల పారదర్శకత పెరగడం, అవినీతి తగ్గడం, సరఫరా సామర్థ్యం మెరుగుపడటం మరియు ఫిర్యాదుల పరిష్కారం వేగవంతం కావడం వంటి ప్రయోజనాలు ఉంటాయి. 80 కోట్లకు పైగా ప్రజలకు ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించనుందని ప్రభుత్వం తెలిపింది.
Also Read: Vivo V70 FE 5G: వివో లేటెస్ట్ 200MP కెమెరా ఫోన్ పై బెస్ట్ డీల్స్ అందించిన ఫ్లిప్ కార్ట్.!
అదే విధంగా, బయో మెట్రిక్ ద్వారా నిజమైన లబ్దిదారులకు మాత్రమే రేషన్ అందేలా చర్యలు తీసుకుంటారు. AI ఆధారిత లబ్ధిదారు డేటా బేస్ ద్వారా నకిలీ రేషన్ కార్డులు మరియు డూప్లికేట్ రేషన్ కార్డు లను గుర్తించే అవకాశం ఉంటుంది. అంతేకాదు, రాష్ట్ర కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ ద్వారా పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించ వచ్చు.