200MP కెమెరాని సిద్ధం చేసిన శామ్సంగ్..!!

HIGHLIGHTS

శామ్సంగ్ భారీ 200ఎంపి కెమెరా ISOCELL HP3 ని సిద్ధం చేసింది

Galaxy S20 Ultra లో అందించిన 108MP సెన్సార్ కంటే కూడా ఇది పెద్దది

గెలాక్సీ S3 లో ఈ భారీ కెమెరాని బహుశా చూడవచ్చు

శామ్సంగ్ భారీ 200ఎంపి కెమెరా ISOCELL HP3 ని సిద్ధం చేసింది మరియు సప్లయర్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. Samsung Galaxy S20 Ultra లో అందించిన 108MP సెన్సార్ కంటే కూడా ఇది పెద్దది. అంతేకాదు, Samsung యొక్క రాబోయే ఫ్లాగ్‌షిప్ Galaxy S23 స్మార్ట్‌ఫోన్‌ ఇప్పటివరకు చూడని అతిపెద్ద రిజల్యూషన్ కెమెరా కలిగిన ఫోన్లలోఒకటిగా చెప్పబడింది. అంటే, గెలాక్సీ S3 లో ఈ భారీ కెమెరాని చూడవచ్చని అర్ధం.

అప్ కమింగ్ గెలాక్సీ S23 సిరీస్‌ లో ప్రధాన కెమెరా 200MP సెన్సార్‌ను కలిగి ఉంటుందని నివేదించబడింది. శామ్సంగ్ గత సంవత్సరం, Samsung ISOCELL HP1 సెన్సార్‌ను అభివృద్ధి చేసింది, ఇది పూర్తిగా కొత్త తరం ఇమేజింగ్ సెన్సార్స్. ఇది మొదటి 200MP స్మార్ట్‌ఫోన్ కెమెరా సెన్సార్‌ను రూపొందించడానికి ఉపయోగించబడింది. ISOCELL HP3, HP1 సెన్సార్‌కి మూడవ అప్‌ డేట్, ఇది సెన్సార్ యొక్క పూర్తి వెర్షన్, ఇది ప్రజలకు కోసం విడుదల చేయబడుతుంది.

ISOCELL HP3 అనేది HP1 యొక్క మెరుగైన వెర్షన్, అయితే ఇది ఏయే విషయాల్లో గొప్పగా ఉంటుందనేది మాత్రం అస్పష్టంగా ఉంది. పోల్చి చూస్తే, HP1 8K మరియు 4K వీడియోలను రికార్డ్ చేయగలదు మరియు అధునాతన HDR మరియు డబుల్ సూపర్ ఫేజ్ డిటెక్షన్ ఆటోఫోకస్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

HP3 సెన్సార్ ప్రక్కనే ఉన్న 16 పిక్సెల్‌లను ఒకే జెయింట్ పిక్సెల్‌గా కలపడానికి 4×4 హైబ్రిడ్ పిక్సెల్-బిన్నింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇది బ్రైట్ మరియు డిటైల్డ్ 12.5MP ఇమేజ్‌కి దారి తీస్తుంది. అంటే ఈరోజు మనం స్మార్ట్‌ఫోన్‌లో చూసే దానికంటే ఫోటోలు చాలా షార్ప్‌గా ఉండవచ్చు. అధిక మెగాపిక్సెల్ కౌంట్ కారణంగా, డిజిటల్ జూమ్ సామర్థ్యాలు కూడా అద్భుతంగా ఉండవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :