Motorola Edge 70 Pro launched in India and know price and features
Motorola Edge 70 Pro: గత కొంత కాలంగా మోటరోలా టీజింగ్ చేస్తున్న లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ను ఈరోజు విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను చాలా స్లీక్ అండ్ స్టన్నింగ్ డిజైన్ లో లాంచ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ సూపర్ నైట్ కెమెరా మరియు పవర్ ఫుల్ చిప్ సెట్ తో రిలీజ్ అయింది. ఈరోజు సరికొత్తగా విడుదలైన ఈ ఫోన్ ప్రైస్, ఆఫర్స్ మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ను రెండు వేరియంట్స్ లో అందించింది. ఈ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ (8GB + 256GB) ని రూ. 38,999 ధరతో అందించింది. ఈ ఫోన్ హై ఎండ్ (12GB + 256GB) ని రూ. 41,999 ధరతో అందించింది. ఈ ఫోన్ మిడ్ రేంజ్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేసింది. మోటోరోలా ఈ ఫోన్ ను పాంటోన్ లిల్లీ వైట్, పాంటోన్ టీ మరియు పాంటోన్ టైటాన్ మూడు రంగుల్లో అందించింది.
ఈ ఫోన్ పై మంచి లాంచ్ ఆఫర్స్ కూడా మోటోరోలా ప్రకటించింది. ఈ ఫోన్ పై Axis అండ్ HDFC క్రెడిట్ కార్డు పై రూ. 2,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అలాగే, రూ. 2,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది. అయితే, ఏదైనా ఒక ఆఫర్ మాత్రమే ఒకసారి లభిస్తుంది.
ఇక ఈ ఫోన్ సేల్ డేట్ విషయానికి వస్తే, ఏప్రిల్ 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు మోటోరోలా అఫీషియల్ వెబ్సైట్ నుండి సేల్ అవుతుంది.
మోటరోలా ఎడ్జ్ 70 ప్రో స్మార్ట్ ఫోన్ స్లీక్ అండ్ స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 6.8 ఇంచెస్ కర్వుడ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఈ స్క్రీన్ HDR10+ సపోర్ట్, 144Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ మరియు 5200 నిట్స్ హెవీ బ్రైట్నెస్ కూడా ఉంటుంది. అనుకుండా ఫోన్ క్రింద పడినా కూడా తట్టుకునే మిలటరీ గ్రేడ్ డ్యూరాబిలిటీ ఈ ఫోన్ కలిగి ఉంది.
ఈ మోటోరోలా కొత్త ఫోన్ 2.4Mn+ AnTuTu స్కోర్ అందించే అల్ట్రా ఫాస్ట్ మీడియాటెక్ Dimensity 8500 Extreme చిప్ సెట్ తో ఈ ఫోన్ ను అందించింది. ఈ చిప్ సెట్ కి జతగా 12GB LPDDR5X ర్యామ్ మరియు 256GB హెవీ స్టోరేజ్ కూడా అందించింది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ OS తో లాంచ్ అయ్యింది మరియు మోటో AI సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
కెమెరా పరంగా, ఈ ఫోన్ 50MP Sony LYT 710 మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ మరియు జతగా మరో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 60FPS వద్ద 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు అద్భుతమైన నైట్ మోడ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా ఈ ఫోన్లో అందించింది.
Also Read: బడ్జెట్ ధరలో 150 ఇంచ్ Smart Projector రిలీజ్ చేసిన Boat
ఈ ఫోన్ కేవలం 6.99mm స్లీక్ డిజైన్ లో కూడా భారీ 6500 mAh బ్యాటరీ తో వచ్చింది. ఇది 90W టర్బో పవర్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. Dolby Atmos మరియు Hi Res ఆడియో సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది. ఈ ఫోన్ IP68 అండ్ IP69 రేటింగ్ తో గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా వచ్చింది.