మీ WhatsApp Hack అయిందని డౌటా .. తెలుసుకోవడం ఎలా.!

HIGHLIGHTS

జీవితంలో WhatsApp ఒక అంతర్భాగమై పోయిందనడంలో ఎటువంటి సందేహం లేదు

మీ వాట్సాప్ ఖాతా హ్యాక్ అయిందని అనుమానంగా ఉంటే ఈజీగా తెలుసుకోండి

చిన్న చిన్న టిప్స్ మరియు సూచనలతో మీరు కనిపెట్టొచ్చు

నేటి టెక్ యుగంలో స్మార్ట్‌ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో WhatsApp ఒక అంతర్భాగమై పోయిందనడంలో ఎటువంటి సందేహం లేదు. వ్యక్తిగత సంభాషణ మొదలుకొని ఆఫీస్ వర్క్ వరకు అన్ని పనులు దీని ద్వారానే జరుగుతున్నాయి. అయితే, సౌకర్యం తో పాటు భద్రతాపరమైన ముప్పు కూడా పెరుగుతున్నాయి. మీ ప్రమేయం లేకుండా ఎవరైనా మీ వాట్సాప్ సందేశాలు చదువుతురు లేదా మీ వాట్సాప్ ఖాతా హ్యాక్ అయిందని అనుమానంగా ఉంటే, చిన్న చిన్న టిప్స్ మరియు సూచనలతో మీరు కనిపెట్టొచ్చు.

లింక్డ్ డివైసెస్ చెక్ చేయండి

మొదటిగా నీ వాట్సాప్ అకౌంట్ తో లింక్ చేసిన లింక్డ్ డివైసెస్ ను ముందుగా చెక్ చేయండి. మీ వాట్సాప్ వేరే ఎక్కడైనా లాగిన్ అయి ఉందో లేదో తెలుసుకోవడానికి ఇది అత్యంత సులభమైన మరియు ప్రధాన మార్గం. ఇది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ క్రింద చూడవచ్చు

  • వాట్సాప్ ఓపెన్ చేసి, పైన ఉన్న మూడు చుక్కల పై క్లిక్ చేయండి
  • ‘Linked Devices’ ఆప్షన్‌ను ఎంచుకోండి
  • ఇక్కడ మీకు తెలియని ఏదైనా బ్రౌజర్ (Chrome, Safari) లేదా గుర్తు తెలియని డివైస్ కనిపిస్తే, వెంటనే దానిపై క్లిక్ చేసి ‘Log Out’ చేయండి.

మీ అకౌంట్ తీరును గమనించండి

మీ ఫోన్‌లో మీరు చేయని కొన్ని మార్పులు కనిపిస్తే అది హ్యాకింగ్‌కు సంకేతం కావచ్చు. అంటే, మీరు పంపని మెసేజ్ అవతలి వారికి వెళ్లడం, మీకు తెలియకుండానే మీ ప్రొఫైల్ ఫోటో లేదా స్టేటస్ మారిపోవడం లేదా మీరు చదవకముందే కొన్ని మెసేజ్‌లు చదివినట్లు బ్లూ టిక్ చూపించడం. ఇలాంటి వింత ప్రవర్తన మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానం వ్యక్తం చేయొచ్చు.

ఫోన్ పనితీరులో మార్పులు

ఒకవేళ మీ ఫోన్‌ లో ఏదైనా స్పైవేర్ ఇన్‌ స్టాల్ అయ్యి ఉంటే, మీ ఫోన్ అసాధారణంగా ప్రవర్తిస్తుంది. అంటే, బ్యాటరీ చాలా వేగంగా అయిపోవడం, ఫోన్ వాడకపోయినా విపరీతంగా వేడెక్కడం మరియు బ్యాగ్ రౌండ్ లో అనవసరంగా వాట్సాప్ అవ్వడం వంటివి జరుగుతాయి. ఇలా జరిగినా మీ వాట్సాప్ అకౌంట్ పై ఎవరో గుప్తంగా స్పై చేస్తున్నట్లు మీరు అనుమానం వ్యక్తం చేయవచ్చు.

మీ వాట్సాప్ సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి?

మీ వాట్సప్ అకౌంట్ ను ఇతరులు హ్యాక్ చేయకుండా భద్రంగా కాపాడుకోవడానికి కొన్ని భద్రతా చర్యలు తీసుకోండి. ఇందులో ముఖ్యమైనది ‘Two-Step Verification’ ఇది మీ వాట్సాప్ అకౌంట్ ఎనేబుల్ చేయడం చాలా ముఖ్యం. దీనికోసం మీ వాట్సాప్ అకౌంట్ సెట్టింగ్స్ లోకి వెళ్లి అకౌంట్ టూ స్టెప్ వెరిఫికేషన్ ఆప్షన్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఒక ఆరు అంకెల పిన్ (PIN) సెట్ చేసుకోండి. ఇలా చేయండి వలన ఎవరైనా ఎప్పుడైనా మీ నంబర్‌తో లాగిన్ అవ్వాలన్నా ఈ పిన్ అడుగుతుంది. అంటే, ఈ పిన్ లేకుండా మీ వాట్సాప్ తో లాగిన్ అవ్వడం అసంభవం అవుతుంది. అయితే, మీరు ఈ నెంబర్ ను ఎవరితో షేర్ చేయకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది.

OTP ఎవరికి షేర్ చేయకండి

వాట్సాప్ రిజిస్ట్రేషన్ కోడ్ లేదా ఏదైనా OTP ని మీకు తెలియని గుర్తు తెలియని వ్యక్తులకు, ఫోన్ కాల్స్‌ లో అడిగినా చెప్పకండి.

స్క్రీన్ లాక్ వాడండి

వాట్సాప్ యాప్‌ కు ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడి లాక్ సెట్ చేసుకోండి. ఇలా చేస్తే ప్రతి సారి మీ వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీ ఫింగర్ ప్రింట్ అవసరం అవుతుంది.

అఫీషియల్ యాప్ మాత్రమే వాడండి

గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే వాట్సాప్ యాప్ ను డౌన్ లోడ్ చేయండి. GB WhatsApp లేదా Mod apps వంటివి అవాయిడ్ చేయండి.

Aslo Read: Redmi A7 మరియు A7 Pro రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసిన షియోమీ.!

అపరిచిత లింక్స్‌ క్లిక్ చేయకండి

బహుమతులు వస్తాయని లేదా మీకోసం ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నాయని వచ్చే అనుమానాస్పద లింక్స్‌పై క్లిక్ చేయకండి. ఇలా చేస్తే మీ వాట్సాప్ అకౌంట్ మరియు ఫోన్ కూడా స్కామర్లు సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.

వాట్సాప్ అకౌంట్ మన పర్సనల్ మరియు అఫీషియల్ పనులకు కూడా ప్రధాన మార్గం కాబట్టి వాట్సాప్ అకౌంట్ ను సురక్షితంగా చూసుకోవాలి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. పైన మేము అందించిన చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ వాట్సాప్ డేటా సురక్షితంగా ఉంటుంది. అన్నింటి కన్నా ముఖ్యంగా మీరు మీ ‘Linked Devices’ ని ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం అలవాటు చేసుకోవడం మంచిది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :