ఈరోజు ఇండియన్ మార్కెట్లో శామ్సంగ్ ఊహించనంత తక్కువ ధరకే 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే, శామ్సంగ్ గెలాక్సీ M13 5G స్మార్ట్ ఫోన్ మరియు ఇది మరిన్ని ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లను కూడా కలిగి వుంది. అయినా కూడా శామ్సంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ధరలను మాత్రం 15 వేల సబ్ కేటగిరిలో అందించింది. కేవలం రూ.13,999 రూపాయల ప్రారంభ ధరలో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ 11- 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది మరియు ర్యామ్ ప్లస్ ఫీచర్ తో 12GB భారీ ర్యామ్ ను కూడా ఆఫర్ చేయగలదని కంపెనీ తెలిపింది.
Survey
✅ Thank you for completing the survey!
శామ్సంగ్ గెలాక్సీ M13 5G : ధర మరియు లాంచ్ అఫర్
శామ్సంగ్ గెలాక్సీ M13 5G స్టార్టింగ్ వేరియంట్ 4జీబీ మరియు 64జీబీ స్టోరేజ్ ధర రూ.13,999. ఈ ఫోన పైన లాంచ్ అఫర్ ను కూడా శామ్సంగ్ అందించింది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా కొనే వారికి 1,000 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. జూలై 23 నుండి M13 5G సేల్ కి అందుబాటలోకి వస్తుంది. అమెజాన్, Samsung.com మరియు అన్ని ప్రధాన స్టోర్ లలో ఈ ఫోన్ లభిస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ M13 5G స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ 5G చిప్ సెట్ Dimensity 700 శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ కూడా ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది మరియు One UI 3.1 స్కిన్ తో వుంటుంది.
కెమెరాల పరంగా, ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. ఇందులో, 50ఎంపీ మైన్ కెమెరాకి జతగా డెప్త్ కెమెరా ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీని 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.