200MP కెమెరా సెన్సార్ ప్రకటించిన శామ్సంగ్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!

200MP కెమెరా సెన్సార్ ప్రకటించిన శామ్సంగ్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!
HIGHLIGHTS

శామ్సంగ్ 200MP కెమెరా సెన్సార్ ని ప్రకటించింది

ఈ సెన్సార్ కేవలం 0.56-మైక్రోమీటర్ అతి చిన్న పిక్సెల్‌తో వస్తుంది

ఈ సెన్సార్ గొప్ప ఫోటోలు మరియు వీడియోలను చిత్రీకరించగల శక్తితో వస్తుంది

అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్సంగ్ 200MP కెమెరా సెన్సార్ ని ప్రకటించింది. అదే, Samsung ISOCELL HP3 మరియు ఇది కేవలం 0.56-మైక్రోమీటర్ చుట్టూ విస్తరించి ఉన్న అతి చిన్న పిక్సెల్‌తో వస్తుంది. అయితే, ఈ సెన్సార్ గొప్ప ఫోటోలు మరియు వీడియోలను చిత్రీకరించగల శక్తితో వస్తుంది. ఈ సెన్సార్ సూపర్ QPD ఆటో ఫోకస్, స్మార్ట్ ISO ప్రో మరియు Tetrapixel పిక్సెల్ బిన్నింగ్ వంటి అనేక ఫీచర్లతో ప్యాక్ చేయబడింది. శామ్సంగ్ సరికొత్తగా ఆవిష్కరించిన ఈ 200MP కెమెరా సెన్సార్ ప్రత్యేకతల పై ఒక లుక్ వేద్దాం.

Samsung ISOCELL HP3:

ఈ సెన్సార్ 0.56μm యొక్క 12% చిన్న పిక్సెల్ పరిమాణం 20% చిన్న కెమెరా మాడ్యూల్‌కు దారితీస్తుంది. దీని అర్ధం సమర్ధవంతమైన 200MP కెమెరా అయినా కూడా ఫోన్ ను సన్నగా నిర్మించేందుకు సహాయం చేస్తుంది.

Samsung 200MP (2).jpg

ఇక ఈ శామ్సంగ్ 200MP కెమెరా సెన్సార్ యొక్క ప్రత్యేకతల విషయానికి వస్తే, ఇది సూపర్ QPD "మరింత ఖచ్చితమైన మరియు వేగవంతమైన ఆటో-ఫోకసింగ్" ని ఎనేబుల్ చేయడానికి సమాంతర మరియు నిలువు డైరెక్షన్ లలో తేడాలను ఉపయోగిస్తుంది. ఈ కెమరాతో మీరు 30fps లో 8K వీడియో లేదా 120fps లో 4K వీడియోలను షూట్ చేయవచ్చు.

Tetra Pixel టెక్నాలజీ 16 పిక్సెల్స్ ను ఒకదానిలో ఒకటిగా కలుపుతుంది. అంటే, ఇది 1.12μm-పిక్సెల్‌లతో 50MP సెన్సార్ లేదా 2.24μm-పిక్సెల్‌లతో 12.5MP సెన్సార్‌ని అనుమతిస్తుంది. ఇది "మసకబారిన వాతావరణంలో కూడా పవర్ ఫుల్ షాట్‌ లను" అందించగలదని కంపెనీ ప్రత్యేకించి చెబుతోంది. ఇక చివరిగా, Smart-ISO Pro మెరుగైన HDR స్నాప్స్ కోసం Low ISO, మిడ్ ISO మరియు హై ISO నుండి డేటాను మిళితం చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo