అమెజాన్ నుండి శామ్సంగ్ గెలాక్సీ M33 5G పైన అతిభారీ డిస్కౌంట్..!

అమెజాన్ నుండి శామ్సంగ్ గెలాక్సీ M33 5G పైన అతిభారీ డిస్కౌంట్..!
HIGHLIGHTS

అమెజాన్ నుండి శామ్సంగ్ గెలాక్సీ M33 5G పైన అతిభారీ డిస్కౌంట్ ప్రకటించింది

Galaxy M33 5G ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మొదలవ్వడానికి ముందే ఈ భారీ అఫర్ ప్రకటించి ఆశ్చర్యపరిచింది

అమెజాన్ నుండి శామ్సంగ్ గెలాక్సీ M33 పైన అతిభారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ ద్వారా ఈ శామ్సంగ్ 5G స్మార్ట్ ఫోన్ ను ను ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ పైన అందించిన బ్యాంక్ అఫర్ ను కూడా కలుపుకుంటే ఈ ఫోన్ మీరు ఊహించానంత తక్కువ ధరకే లభిస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మొదలవ్వడానికి ముందే అమెజాన్ ఈ భారీ అఫర్ ను ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది. మరింకెందుకు ఆలశ్యం, శామ్సంగ్ గెలాక్సీ M33 పైన అమెజాన్ అందించిన ఆ డిస్కౌంట్ ఆఫర్లను చూద్దాం పదండి.  

Samsung Galaxy M33 5G: ధర మరియు ఆఫర్లు

శామ్సంగ్ గెలాక్సీ ఎం33 5జి స్మార్ట్ ఫోన్ యొక్క స్టార్టింగ్ వేరియంట్ (6GB + 128GB) నిన్నటి వరకూ ధర రూ.17,999 ధరతో ఉండగా, ఈరోజు అమెజాన్ అందించిన డిస్కౌంట్ తరువాత ఈ ఫోన్ కేవలం రూ.14,499 రూపాయల ప్రారంభ దరకే లభిస్తోంది. మరొక వేరియంట్ (8GB + 128GB) ను కేవలం రూ.15,999 రూపాయలకే అఫర్ చేస్తోంది.అధనంగా, ఈ స్మార్ట్ ఫోన్ ను SBI బ్యాంక్ కార్డ్ ద్వారా కొనేవారికి 1,500 రూపాయల వరకూ తక్షణ డిస్కౌంట్ అందుతుంది. అంటే, కేవలం రూ.13,000 రూపాయలకే ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. Buy From Here   

Samsung Galaxy M33 5G:స్పెక్స్

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి శామ్సంగ్ రివీల్ చేసిన స్పెక్స్ విషయానికి వస్తే, గెలాక్సీ ఎం33 5జి స్మార్ట్ ఫోన్ లో ఇన్ఫినిటీ-V కటౌట్ కలిగిన 6.6- ఇంచ్ TFT డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంటుంది. ఈ పూర్తి డిస్ప్లే ని గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో జత చేసింది. ఈ M33 ఫోన్ శామ్సంగ్ యొక్క సొంత 5G మరియు 5nm ప్రోసెసర్ Exynos 1280 కి జతగా 6/8GB LPDDR4x RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ ర్యామ్ కు సమానమైన వర్చువల్ ర్యామ్ ను కూడా ఇందులో అందించడం విశేషం.

ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 6000 mAh భారీ బ్యాటరీని కలిగివుంటుంది. అయితే, ఈ ఫోన్ బాక్స్ లో ఛార్జర్ ను మాత్రం అందించడం లేదని కంపెనీ తెలిపింది. పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంలో చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇలా చేయవలసి వచ్చినట్లు శామ్సంగ్ స్పష్టం చేసింది. ఈ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమెరాను ఇన్ఫినిటీ-V కటౌట్ లో అందించింది. అలాగే, 50MP ప్రధాన సెన్సార్, 5MP అల్ట్రావైడ్, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మాక్రో సెన్సార్ కలిగిన క్వాడ్ రియర్ కెమెరా మాడ్యూల్‌ను కలిగివుంది. ఈ ఫోన్ గ్రీన్ మరియు బ్లూ రెండు కలర్ అప్షన్ లలో కనిపిస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా One UI 4.1 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo