Royal Enfield Hunter 350: 7 న వస్తున్న కొత్త బైక్..ధర ఎంతో తెలుసా?

HIGHLIGHTS

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ మార్కెట్లోకి వస్తోంది

Royal Enfield Hunter 350 ఆగష్టు 7న వస్తోంది

బైక్ ప్రియులను ఆకట్టుకునే విధంగా కళ్ళు చెదిరే డిజైన్ తో వస్తోంది

Royal Enfield Hunter 350: 7 న వస్తున్న కొత్త బైక్..ధర ఎంతో తెలుసా?

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ మార్కెట్లోకి వస్తోంది. అదే, Royal Enfield Hunter 350 మరియు దీన్ని కంపెనీ ఆగష్టు 7 లాంఛన ప్రాయంగా మార్కెట్ లో ప్రవేశపెట్టబోతోంది. అంటే, రాయల్ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ప్రియులు మరికొంత కలం ఈ బైక్ కోసం వేచి చూడవలసి వస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ ప్రియులను ఆకట్టుకునే విధంగా కళ్ళు చెదిరే డిజైన్ తో వస్తోంది. త్వరలో రానున్న ఈ బైక్ గురించి కొత్త సంగతులు ఏమిటో తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 తక్కువ బరువుతో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. Hunter 350 బరువు Classic 350 మరియు Meteor  350 రెండు బైకుల కంటే కూడా 15 కిలోల వరకూ తక్కువగా ఉంటుందని తెలిపింది. అంతేకాదు, గతంలో కంటే ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ పెర్ఫార్మెన్స్ మరింత మెరుగుగా  ఉంటుందని కూడా పేర్కొంది. ఈ బైక్ 1370 మి.మీ వీల్ బేస్ కలిగి ఉండగా, ఈ బైక్ పొడవు 2055mm గా ఉంటుంది. ఈ బైక్ మొత్తం 8 కలర్ అప్షన్లతో వస్తుండగా, టాప్ ఎండ్ వేరియంట్‌లో మాత్రం డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ ఉంటుంది.

Royal Enfield Hunter 350 బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ యొక్క అత్యంత తక్కువ ధర కలిగిన బైక్‌గా నిలవబోతోందని వినికిడి. ఈ బైక్ యొక్క ధర రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క Meteor 350 మరియు క్లాసిక్ 350 ధరల కంటే కూడా తక్కువగా ఉండబోతోంది. ఈ బైక్ ధర 1.5 లక్షల రూపాయల నుంచి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. అంటే, ఇంక చెప్పేదేముంది ఈ బైక్ అద్భుతమైన అమ్మకాలను సాగిస్తుందని భావిస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo