Meta AI Muse యూజర్లకు తెలియకుండానే ప్రైవేట్ చాట్స్ యాక్సెస్ చేస్తోందా.!

Highlights

Meta AI Muse యూజర్లకు తెలియకుండానే ప్రైవేట్ చాట్స్ యాక్సెస్ చేస్తోందని రిపోర్ట్

వ్యక్తిగత సమాచార భద్రత పై ఆందోళన కూడా పెరుగుతున్నాయి

ఈ వ్యవహారానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి

Meta AI Muse యూజర్లకు తెలియకుండానే ప్రైవేట్ చాట్స్ యాక్సెస్ చేస్తోందా? అంటే నిజమే అని అంటున్నాయి కొత్త రిపోర్ట్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరుగుతున్న కొద్దీ వ్యక్తిగత సమాచార భద్రత పై ఆందోళన కూడా పెరుగుతున్నాయి. తాజాగా మెటా సంస్థకు చెందిన మూస్ ఏఐ ఏజెంట్ వ్యవహారం టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. యూజర్లకు తెలియకుండానే ఈ AI ఏజెంట్ ప్రైవేట్ మెసేజ్‌ మరియు ఆర్థిక సమాచారాన్ని కూడా యాక్సెస్ చేస్తున్నట్లు కొన్ని నివేదికలు వెలువడ్డాయి. రాయిటర్స్ పరిశోధనలో కూడా ఈ వ్యవహారానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

Meta AI Muse సిగ్నల్ మెసేజ్ లను చదివిందా?

రాయిటర్స్ నివేదిక ప్రకారం, మెటా ఉద్యోగులు మూస్ ఏఐ పనితీరుపై కొన్ని ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా Signal వంటి మెసేజింగ్ యాప్స్ లోని ప్రైవేట్ సంభాషణలను ఈ AI యాక్సెస్ చేసినట్లు కొన్ని సందర్భాల్లో గుర్తించినట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో నోటిఫికేషన్ యాక్సెస్ ద్వారా మెసేజ్ ప్రివ్యూలను చదవడం, Mac కంప్యూటర్లలో స్క్రీన్‌ షాట్లు మరియు యాక్సెసిబిలిటీ అనుమతుల ద్వారా సమాచారాన్ని చూడటం వంటి అంశాలను పరిశోధకులు తమ టెస్టింగ్ లో గుర్తించారు.

బ్యాంక్ వివరాలు అండ్ Airbnb బుకింగ్‌ పైనా ఆరోపణలు

కొన్ని సందర్భాల్లో యూజర్లు అందించని బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలను కూడా మ్యూస్ ప్రస్తావించినట్లు ఉద్యోగులు రిపోర్ట్ చేశారు. అంతేకాకుండా జరగని లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని రూపొందించడం మరియు అనుమతి లేకుండా బుకింగ్స్ చేసినట్లు కూడా ఒక ఉద్యోగి ఫిర్యాదు చేసినట్లు నివేదిక పేర్కొంది. అయితే, ఈ ఆర్థిక వివరాలు నిజమైన సమాచారమా లేదా AI సృష్టించిన తప్పుడు సమాధానాలా అనేది ఇంకా స్పష్టంగా నిర్ధారణ కాలేదు.

Meat ఏం చెబుతోంది?

ఈ ఆరోపణలపై మెటా స్పందిస్తూ, ఇవి కొన్ని పరిమిత సందర్భాల్లో జరిగిన సంఘటనలని మెటా తెలిపింది. యూజర్లు అనుమతులు ఇచ్చినప్పుడే ఇతర యాప్‌ ల సమాచారాన్ని మూస్ యాక్సెస్ చేయగలదని పేర్కొంది. కొన్ని సందర్భాల్లో AI తప్పుడు సమాచారాన్ని సృష్టించి ఉండవచ్చని కూడా వివరించింది.

ఈ ఘటన AI ఏజెంట్లకు ఇచ్చే అనుమతుల విషయంలో వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మనకు గుర్తుచేస్తోంది. ముఖ్యంగా నోటిఫికేషన్ మరియు స్క్రీన్ యాక్సెస్ వంటి ముఖ్యమైన వాటికి అనుమతులు ఇచ్చే ముందు వాటి అవసరాన్ని మరింత పరిశీలించడం మంచిది.

ఏది ఏమైనా అన్ని విషయాలకు ఏఐ పై ఆధార పడకుండా మాన్యువల్ గా చేయడం అలవాటు చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే, స్మార్ట్ ఫోన్ లో పరిమితులు ఇచ్చే సంశయంలో ఆచితూచి పరిమితులను ఇవ్వడం మంచిదని కూడా చెబుతున్నారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile