ఎయిర్ కూలర్ కొనడానికి వెళ్లే ముందుగా ఈ మూడు విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోండి

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 07 Apr 2021
HIGHLIGHTS
  • గతకొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి

  • ఒక మంచి కూలర్ కొనాలని ఆలోచిస్తున్నారా?

  • తక్కువ ధరలోనే ఒక మంచి ఎయిర్ కూలర్ ని మీ సొంతం చేసుకోవచ్చు.

ఎయిర్ కూలర్ కొనడానికి వెళ్లే ముందుగా ఈ మూడు విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోండి
ఎయిర్ కూలర్ కొనడానికి వెళ్లే ముందుగా ఈ మూడు విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోండి

గతకొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. మరి మండే ఎండల నుండి మీ కుటుంభం ఉపశమనం పొందేలా చూడడానికి ఒక మంచి కూలర్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే, ఈరోజు మేము మీకు ఒక మంచి కూలర్ కొనేలా చూసేందుకు సహాయపడతాము.

కూలర్ కొనడానికి ఎందుకు ఎక్కువగా ఆలోచించాలి అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే, ప్రస్తుతం ఒక మంచి బ్రాండెడ్ రూమ్ కూలర్ కొనాలంటే కనీసం పదివేల రూపాయలైనా ఖర్చు చేయాల్సిందే. అందుకే, ఈ విషయాలను గుర్తుంచుకుంటే తక్కువ ధరలోనే ఒక మంచి ఎయిర్ కూలర్ ని మీ సొంతం చేసుకోవచ్చు.

మొదటి విషయం

మనం ఎటువంటి కూలర్ ని కొనాలనుకుంటున్నామో ముందుగా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే, కేవలం ఒక్కరు ఇద్దరి కోసం అయితే పర్సనల్ కూలర్ సరిపోతుంది. కానీ, మీ రూమ్ మొత్తం చల్లని గాలితో నింపాలంటే  మాత్రం డెజర్ట్ కూలర్ ని తీసుకోవాల్సి వుంటుంది.

రెండవ విషయం

ఒక ఎయిర్ కూలర్ తీసుకునేప్పుడు అతిముఖ్యంగా చూడాల్సిన విషయం వాటర్ ట్యాంక్ కెపాసిటీ.  ఎయిర్ కూలర్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఎక్కువగా ఉంటుందో, కూలర్ కూడా అంత ఎక్కవ కూలింగ్ కెపాసిటీని కలిగి వుంటుంది. ఒక చిన్న రూమ్ కోసం 15 లీటర్ల కెపాసిటీ, మీడియం సైజు రూమ్ కోసం 25 లీటర్ల కెపాసిటీ మరియు పెద్ద రూమ్ కోసం కనీసం 40 లీటర్ల కెపాసిటీ గల కూలర్ ను ఎంచుకోవాలి.

మూడవ విషయం

ఇక మరొక ముఖ్యమైన విషయం కూలర్ ప్యాడ్స్. ఎందుకంటే, కూలర్ కూలింగ్ ని నిర్ణయించేది కూలింగ్ ప్యాడ్స్. మూడు రకాలైన ప్యాడ్స్ తో కూలర్లు వస్తాయి. 1. చెక్క గ్రాస్ కూలర్ ప్యాడ్స్ 2. ఆస్పెన్ చెట్టు గ్రాస్ ప్యాడ్స్ 3. హాని కోంబ్ ప్యాడ్స్.  ఈ మూడు రకాల కూలింగ్ ప్యాడ్స్ లో కూడా హాని కోంబ్ ప్యాడ్స్ ఉత్తమంగా ఉంటాయి.

logo
Raja Pullagura

email

Web Title: remember these 3 things before buying a air cooler
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status