జియో 5G అనుసంధాన ఉచిత Wi-Fi సర్వీస్ లాంచ్ చేసిన ఆకాష్ అంబానీ.!
రిలయన్స్ జియో తన కస్టమర్లను ఉత్తేజపరచే ప్లాన్స్ అందించే టెలికం కంపెనీలలో ఒకటి.
జియో 4G ప్లాన్స్ పైనే కస్టమర్లకు 5G లాభాలను ఆఫర్ చేస్తోంది
Jio True 5G ఆధారిత Wi-Fi సర్వీస్ లను తీసుకువచ్చింది
రిలయన్స్ జియో తన కస్టమర్లను ఉత్తేజపరచే ప్లాన్స్ అందించే టెలికం కంపెనీలలో ఒకటి. ఇండియాలో 4G సర్వీస్ లను ప్రారంభిస్తూనే ఉచిత సర్వీస్ లను ప్రకటించి, అందరిని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు కూడా అదే దారిలో Jio 5G సర్వీస్ లను ప్రారంభించినా 5G ప్లాన్ లను ఇంకా ప్రకటించక పోవడంతో 4G ప్లాన్స్ పైనే కస్టమర్లకు 5G లాభాలను ఆఫర్ చేస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు మరొక కొత్త గుడ్ న్యూస్ ను కూడా అందించింది. Jio True 5G ఆధారిత Wi-Fi సర్వీస్ లను ఎటువంటి చార్జీలు లేకుండా కూడా అందుబాటులోకి జియో అందుబాటులోకి తీసుకువచ్చింది.
Surveyఈ వారం ప్రారంభంలో రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా టెంపుల్ నుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, ఆకాష్ అంబానీ ఈ Jio True 5G పవర్డ్ WiFi సర్వీస్ లను ప్రారంభించారు. ఆకట్టుకునే విషయం ఏమిటంటే, ఈ Jio True 5G పవర్డ్ WiFi సర్వీస్ లను ఎటువంటి ఛార్జీలు లేకుండా అందించారు.
ఈ అతిపెద్ద టెలికం కంపెనీ, ఇండియాలో ఈ సర్వీస్ లను విద్యాసంస్థలు, మతపరమైన ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, వాణిజ్య కేంద్రాలు మరియు మరిన్ని రద్దీ ప్రాంతాలలో అందుబాటులోకి తీసుకువస్తుందని ప్రకటించింది. అంతేకాదు, Jio వెల్‌కమ్ ఆఫర్ తో తాజాగా చెన్నై నగరాన్ని కూడా జోడించింది మరియు త్వరలోనే మరిన్ని నగరాలను దీని పరిధిలోకి తీసుకువస్తుందని జియో తెలిపింది.
పవిత్ర పట్టణం నాథ్‌ద్వారా లో కొలువున్న లార్డ్ శ్రీనాథ్ జీ ఆలయంలో మొదటి True 5G -ఎనేబుల్డ్ Wi-Fi సేవను అందించాము. ఈ సర్వీస్ లను మేము అనేక పట్టణాలకు కూడా విస్తరిస్తాము. తద్వారా అనేక ప్రాంతాలకు ఈ సేవలను అందించ గలుగుతాము. అని, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile