జియో బడ్జెట్ అఫర్: కేవలం రూ.75 ధరకే అన్లిమిటెడ్ సర్వీస్…కానీ..!

జియో బడ్జెట్ అఫర్: కేవలం రూ.75 ధరకే అన్లిమిటెడ్ సర్వీస్…కానీ..!
HIGHLIGHTS

జియో తన ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచింది

చవక ధరకే అన్లిమిటెడ్ సర్వీస్ అందించే ప్లాన్ కూడా వుంది

హై-స్పీడ్ డేటాతో సహా అనేక ప్రయోజనాలు అందుతాయి

డిసెంబర్ 1 వ తేదీ నుండి జియో తన ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచింది. ముందునుండే చవక ధరకే అన్లిమిటెడ్ సర్వీస్ ప్రయోజలను అందించే రూ.75 రూపాయల అన్లిమిటెడ్ సర్వీస్ ప్లాన్ ఇప్పటికి అందుబాటులో ఉంచింది. కానీ,ఈ బడ్జెట్ ప్లాన్ యొక్క వ్యాలిడిటీలో మాత్రం మార్పును చేసింది. ఇది కేవలం జియోఫోన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 0.1 GB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, 50 SMS లు మరియు జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ మరియు 200 MB అదనపు డేటాను కూడా అఫర్ చేస్తుంది.

ఇక జియోఫోన్ బెస్ట్ ఆఫర్ల విషయానికి వస్తే, జియోఫోన్ 2021 ఆఫర్ తో జియోఫోన్ ను ఒకేసారి 24 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ తో సహా కేవలం 1,999 రూపాయలకు అందిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా, ఈ అఫర్ ఎంచుకునే కొత్త చందాదారులకు రెండు సంవత్సరాల పాటు ప్రతిరోజూ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు నెలకు 2 జిబి హై-స్పీడ్ డేటాతో సహా అనేక ప్రయోజనాలు అందుతాయి. అధనంగా, జియోఫోన్ ఉచితంగా లభిస్తుంది.

అంతేకాదు, పైన తెలిపిన అన్లిమిటెడ్  ప్రయోజనాలతో  కేవలం ఒక్క సంవత్సరం వ్యాలిడిటీ మాత్రమే కోరుకుంటే, రిలయన్స్ జియో యొక్క జియోఫోన్ 2021 ఆఫర్ కింద ఒక సంవత్సరం ప్లాన్ కూడా అందిస్తోంది. దీని కోసం, చందాదారులు సింగిల్ పేమెంట్ క్రింద రూ .1,499 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో, ఉచిత జియోఫోన్ మరియు 12 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ అందుకోవచ్చు. ఇందులో, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు నెలకు 2 జిబి హై-స్పీడ్ డేటా 12 నెలల వరకు అందుతుంది.

అదనంగా, ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారుల కోసం కూడా ఒక ప్లాన్ ప్రకటించింది. దీనితో, ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారులు నెలకు 2GB డేటా మరియు అన్లిమిటెడ్ కాల్స్ సంవత్సరం మొత్తం పొందవచ్చు. ఇవన్నీ కూడా మరింత కేవలం 899 రూపాయల అఫర్ ధరకే  పొందవచ్చు. అయితే, ప్లాన్ తో జియోఫోన్ మాత్రం రాదు. ఇప్పటికే ఉన్న JioPhone నంబర్లలో మాత్రమే ఈ ప్లాన్ యాక్సెస్ చేయబడుతుంది. వాస్తవానికి, ఈ ప్లాన్ ముందుగా 749 రూపాయలకు అందించబడింది.  

మరిన్ని జియో ఆఫర్స్ కోసం Click Here 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo