రియల్మీ కొత్త 100W SuperDart ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నలాజిని అందించనుంది

రియల్మీ కొత్త 100W SuperDart ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నలాజిని అందించనుంది
HIGHLIGHTS

రియల్మి తన ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కోసం డార్ట్ మరియు సూపర్ డార్ట్ లకు ట్రేడ్ మార్క్ చేసింది.

రియల్మి త్వరలో తన మొదటి 5 జి ఫోన్ రియల్మి X 50 ను విడుదల చేయనుంది. అయితే, ఇప్పుడు కంపెనీ ఒక కొత్త హై ఎండ్ ఛార్జింగ్ టెక్నాలజీ పైన  పనిచేస్తోంది. రియల్మి తన ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కోసం డార్ట్ మరియు సూపర్ డార్ట్ లకు ట్రేడ్ మార్క్ చేసింది.

రియల్మి చేసిన ట్రేడ్‌మార్క్ అప్లికేషన్ యొక్క స్క్రీన్ షాట్‌ ను టిప్‌స్టర్ ముకుల్ శర్మ, సుధాన్షు అంబోర్ ఇప్పుడు షేర్ చేశారు. ఈ స్క్రీన్ షాట్ నుండి పేరు తప్ప వేరే సమాచారం మాత్రం వెల్లడించలేదు. అయితే, ఈ సూపర్‌డార్ట్ నేరుగా షావోమి 100W సూపర్ ఛార్జ్ టర్బో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పోటీ పడుతుందని మాత్రం  చెబుతున్నారు.

షాయోమి యొక్క 100W ఛార్జర్ కేవలం 17 నిమిషాల్లోనే 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని 0 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. ఈ ఏడాది ప్రారంభంలో వివో 120W సూపర్ ఫాస్ట్‌ఛార్జ్ టెక్నాలజీని 13 నిమిషాల్లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఛార్జ్ చేయగలదని చూపించింది.

రియల్మి ప్రస్తుతం తన ఫోన్ల కోసం OPPO యొక్క VOOC ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. రియల్మి X 2 ప్రో సంస్థ యొక్క వేగవంతమైన ఛార్జింగ్ పరికరం. ఈ పరికరం సూపర్‌వూక్ ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీతో వస్తుంది, ఇది 50W ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది, ఇది కేవలం 35 నిమిషాల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తుంది.

రాబోయే రియల్మి X 50 5G స్మార్ట్‌ ఫోన్ కూడా VOOC 4.0 ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది, ఇది 30 నిమిషాల్లో 70 శాతం వరకు పరికరాన్ని ఛార్జ్ చేయగలదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo