5 నిముషాల్లో 50% ఛార్జింగ్ వంటి భారీ ఫీచర్లతో వస్తున్న Realme GT Neo 3

HIGHLIGHTS

Realme GT Neo 3 ని ఇండియాలో విడుదలకు సిద్ధం

150W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్

ఈ ఫోన్ కేవలం 5 నిముషాల్లోనే 50% వరకూ ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది

5 నిముషాల్లో 50% ఛార్జింగ్ వంటి భారీ ఫీచర్లతో వస్తున్న Realme GT Neo 3

రియల్‌మీ భారీ ఫీచర్లతో Realme GT Neo 3 ని ఇండియాలో విడుదల చేయడానికి సిద్దమవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను 150W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ తో తీసుకువస్తోంది మరియు ఈ టెక్ తో ఈ ఫోన్ కేవలం 5 నిముషాల్లోనే 50% వరకూ ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. వాస్తవానికి, రియల్‌మీ ఈ స్మార్ట్ ఫోన్ ను  చైనాలో ఇప్పటికే రిలీజ్ చేసింది మరియు అమ్మకాలను కూడా కొనసాగిస్తోంది. ఈ ఫోన్ కేవలం అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండడం మాత్రామే కాకుండా మరిన్ని భారీ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. మరి ఈ అప్ కమింగ్ రియల్‌మీ స్మార్ట్ ఫోన్ లో ఎటువంటి స్పెక్స్ ను ఎక్స్ పెక్ట్ చేయవచ్చునో చూద్దామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వాస్తవానికి, చైనాలో విడుదలైన ఈ Realme GT Neo 3 వేరియంట్ నే ఇండియాలో కూడా విడుదల చెయ్యవచ్చని మార్కెట్ వర్గాలు ఉహసిస్తున్నాయి. Realme GT Neo 3 చైనా వేరియంట్ స్పెక్స్ వివరాలను క్రింద చూడవచ్చు.           

Realme GT Neo 3: స్పెక్స్ (చైనా వేరియంట్)

రియల్‌మీ జిటి నియో 3 స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది మరియు ఈ డిస్ప్లే 1000 Hz టచ్ శాంప్లింగ్ తో వస్తుంది. సెక్యూరిటీ కోసం ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 8100 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా Realme UI 3.0 కస్టమ్ స్కిన్‌పై పనిచేస్తుంది.

ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP SonyIMX766  మైన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్ ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ అత్యంత వేగవంతమైన 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,500 బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ కేవలం 5 నిముషాల్లోనే 50% ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది.          

Realme GT Neo 3: ధర (చైనా వేరియంట్)

చైనాలో ఈ ఫోన్ యొక్క స్టార్టింగ్ వేరియంట్ (8GB/256GB) ధర CNY 2,599 (సుమారు రూ. 31,100) మరియు రెండవ వేరియంట్ (12GB/256GB) ధర CNY 2,799 (సుమారు రూ. 33,500).

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo