Realme C67 5G First Sale: రియల్ మి కొత్త ఫోన్ మొదటిసారి సేల్ కి వస్తోంది.!
రియల్ మి కొత్త ఫోన్ రియల్ మి సి67 5జి మొదటిసారి సేల్ కి వస్తోంది
ఈ ఫోన్ ను అండర్ 15 వేల రూపాయల ధరలో కంపెనీ విడుదల చేసింది
ఈ కొత్త ఫోన్ ధర, స్పెక్స్ మరియు సేల్ వివరాల పైన ఒక లుక్కేద్దామా
Realme C67 5G First Sale: రియల్ మి కొత్త ఫోన్ రియల్ మి సి67 5జి మొదటిసారి సేల్ కి వస్తోంది. బడ్జెట్ ధరలో కొత్త డిజైన్, లేటెస్ట్ ప్రోసెసర్ మరియు బిగ్ బ్యాటరీతో రియల్ మి ఈ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను అండర్ 15 వేల రూపాయల ధరలో కంపెనీ విడుదల చేసింది. ఐఫోన్ లేటెస్ట్ ఫోన్ లలో కనిపించే డైనమిక్ ఐల్యాండ్ నోటిఫికేషన్ బార్ మాదిరిగా కనిపించే మినీ కాప్స్యూల్ ఫీచర్ ను ఈ ఫోన్ లో అందించింది. ఈ కొత్త ఫోన్ ధర, స్పెక్స్ మరియు సేల్ వివరాల పైన ఒక లుక్కేద్దామా.
SurveyRealme C67 5G First Sale
రియల్ మి సి67 5జి స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ను కంపెనీ రూ. 13,999 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇది 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో ఉంటుంది. రెండవ వేరియంట్ 6GB స్టోరేజ్ మరియు 128GB వేరియంట్ తో రూ. 14,999 ధరతో వచ్చింది. ఈ ఫోన్ Flipkart మరియు రియల్ మి అధికారిక వెబ్సైట్ మరియు అధీకృత రిటైల్ స్టోర్స్ నుండి సేల్ అవుతుంది.
Also Read : Gold Price Update: ఈరోజు గోల్డ్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోండి.!
రియల్ మి సి67 5జి ప్రత్యేకతలు
రియల్ మి సి67 5జి స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ ప్రోసెసర్ Dimensity 6100+ తో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB/6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ఉన్నాయి. అంతేకాదు, 6 GB Dynamic RAM సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ లో 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 8MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000mAh బ్యాటరీని 33W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.

ఈ ఫోన్ డిజైన్ పరంగా కొత్తగా కనిపిస్తోంది మరియు కేవలం 7.89 mm మందంతో చాలా సన్నగా ఉంటుంది. ఈ ఫోన్ ను సెంటర్ పంచ్ హోల్ సెల్ఫీ కెమేరా డిజైన్ కలిగిన 6.72 ఇంచ్ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో అందించింది. ఈ ఫోన్ షీట్ పైన అందించిన స్పెక్స్ మరియు డిజైన్ పరంగా ఈ ధరలో ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.