రేషన్ కార్డ్ లభ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్..!

రేషన్ కార్డ్ లభ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్..!
HIGHLIGHTS

రేషన్ కార్డ్ లభ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది

రేషన్ కార్డ్ తో ఆధార్ అనుసంధానం తప్పని సరి చేసింది

ప్రజలు ఇబ్బదందులు పడకుండా ఉండేందుకు వీలుగా గడువును కూడా పెంచింది

రేషన్ కార్డ్ లభ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. రేషన్ కార్డ్ కలిగిన ప్రతిఒక్కరూ కూడా వారి ఆధార్ కార్డ్ తో రేషన్ కార్డును అనుసంధానం చెయ్యడానికి కేంద్రం నిర్ణయించిన గడువును పొడిగించనట్లు తెలిపింది. ముందుగా, మార్చి 31 లోపుగా రేషన్ కార్డ్ కలిగిన ప్రతిఒక్కరూ కూడా విధిగా వారి వారి ఆధార్ కార్డ్ తో రేషన్ కార్డును అనుసంధానం చెయ్యాలని తెలిపిన కేంద్రం, ఇప్పుడు ఈ గడువును జూన్ 30 వరకూ పొడిగించినట్లు తెలిపినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.

ప్రభుత్వం సరఫరా చేసే నిత్యవసర సరుకులు అర్హత కలిగిన లబ్ధిదారులకు అందేలా చూసేందుకు, రేషన్ కార్డ్ ను ఆధార్ ను అనుసంధానం చేయడం సరైన మార్గం కాబట్టే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా, నకిలీ రేషన్ కార్డులను పూర్తిగా అరికట్టే వీలుంది. అందుకే, రేషన్ కార్డ్ తో ఆధార్ అనుసంధానం తప్పని సరి చేసింది. అయితే, ప్రజలు ఇబ్బదందులు పడకుండా ఉండేందుకు వీలుగా గడువును కూడా పెంచింది. 
                     
వాస్తవానికి, మీ రేషన్ కార్డ్ తో మీ ఆధార్ కార్డ్ ను ఆన్లైన్ లోనే చాలా సులభంగా మీరే లింక్ చేసుకోవచ్చు. PDS portal (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం) పోర్ట్ కు ఓపెన్ చేసి, అందులో మీ రేషన్ కార్డ్ నంబర్ ఆధార్ కార్డ్ నంబర్ మరియు మీ రిజిస్టర్ నంబర్ లను నమోదు చెయ్యాలి. అటుతరువాత మీ రిజిష్టర్ మొబైల్ నంబర్ పైన అందుకున్న OTP నంబర్ ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా మీ ఆధార్ ను మీ రేషన్ కార్డ్ తో లింక్ చేసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo