కొత్త Snapdragon 690 చిప్సెట్ వచ్చేసింది :ఇక తక్కువ బడ్జెట్ ఫోన్లలో కూడా 5G టెక్నాలజీ
భారతదేశంలో ప్రస్తుతానికి, 5G టెక్నాలజీ కేవలం అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ల కోసం మాత్రమే అందించబడింది.
ఇప్పుడు క్వాల్కమ్ కొత్తగా ప్రకటించిన Snapdragon 690 ప్రాసెసర్ తో తక్కువ ధర ఫోన్లలో కూడా 5G టెక్నాలజీ మరియు అద్భుతమైన కెమెరా సాంకేతికత అందుతుంది.
భారతదేశంలో ప్రస్తుతానికి, 5G టెక్నాలజీ కేవలం అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ల కోసం మాత్రమే అందించబడింది. దీనికి కారణం, ఈ 5G టెక్నాలజీ ఇప్పటి వరకూ కేవలం ఖరీదైన ప్రాసెసర్లతో రావడం. అయితే, క్వాల్‌కామ్ 5 జి టెక్నాలజీని మరింత సరసమైన స్మార్ట్ ఫోన్ స్కేల్ కి తేవడానికి కృషి చేస్తోంది. కానీ ఆశ్చర్యకరంగా, శాన్-డియాగో ఆధారిత సంస్థ 6-సిరీస్‌లో మొదటి 5 జి చిప్‌సెట్ అయిన Snapdragon 690 ను ప్రకటించింది. అయితే, ఇది కొత్త స్నాప్‌డ్రాగన్ X51 5G మోడెమ్‌తో 5G యొక్క నెమ్మది వెర్షన్ Sub-6GHz కి మాత్రమే మద్దతు ఇస్తుంది.
Surveyస్నాప్‌డ్రాగన్ 690 చిప్ సెట్, గేమింగ్-సెంట్రిక్ స్నాప్‌డ్రాగన్ 675 తరువాతి తరం చిప్ సెట్ గా సరికొత్త Arm Cortex A77 కోర్స్‌తో పాటు 120Hz డిస్ప్లేలు మరియు 4K HDR వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది.
8nm ఉత్పాదక ప్రక్రియ ఆధారంగా, స్నాప్‌డ్రాగన్ 675 తో పోలిస్తే, 60 శాతం వేగవంతమైన గ్రాఫిక్స్ రెండరింగ్‌తో పాటు, CPU పనితీరులో 20 శాతం వృద్ధిని నమోదుచేస్తుందని Qualcomm నమ్మకంగా చెబుతోంది. అయితే, ఇందులో జతచేయబడిన అతిపెద్ద అంశం లోపల ఉన్న 5G మోడెమ్. ఇవన్నీ, కలగలిపి ఇది మొదటి బడ్జెట్ చిప్‌సెట్‌గా నిలిచింది. తదుపరి తరం కనెక్టివిటీకి మద్దతు ఇవ్వడానికి సంస్థ నుండి ప్రకటించిన ఈ 6-సిరీస్ చిప్‌లను షావోమి, మోటో మరియు నోకియా బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో ఉపయోగించే వీలుంటుంది. అంతేకాదు, సాధారణంగా 8-సిరీస్ లేదా 7-సిరీస్ చిప్‌సెట్ కంటే చాలా సరసమైనవిగా ఉంటాయి.
5 జితో పాటు, మరికొన్ని మెరుగుదలలు కూడా ఉన్నాయి. Snapdragon 690, అత్యధికంగా 192 మెగాపిక్సెల్ కెమెరాల వరకు సపోర్ట్ చేయగలదు మరియు 4K HDR వీడియో క్యాప్చర్‌కు మద్దతు ఇస్తుంది. ఈ రెండూ 6-సిరీస్‌లకు మొదటివి. ఈ చిప్‌సెట్ AI- ఎనేబుల్ తో సున్నితమైన జూమ్‌కు మద్దతు ఇస్తుంది. ఇంకా, ఈ చిప్‌సెట్ 120Hz డిస్ప్లేకి మద్దతు ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
అయినప్పటికీ, స్నాప్‌డ్రాగన్ 690 ఇప్పటికీ చాలా ఖరీదైనది. భారతదేశంలో తక్కువ 6-సిరీస్ చిప్‌సెట్‌లు సబ్ $ 150 (సుమారు రూ .12,000) పరిధిలో ఉపయోగించబడుతున్నాయి. అయితే, యుఎస్‌లో ఈ చిప్‌సెట్ $ 300- $ 500 (రూ .22,000 సుమారుగా) ధర గల పరికరాలను శక్తివంతం చేస్తుందని, క్వాల్‌కామ్‌లోని ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ డిపు జాన్ -సీనియర్ డైరెక్టర్ చెప్పారు. భారతదేశంలో 5 జి అందుబాటులో లేనందున, ఈ పరికరాలను భారతదేశంలో ప్రారంభించటానికి OEM లకు తక్కువ ప్రోత్సాహం ఉంటుంది, ఎందుకంటే స్నాప్‌డ్రాగన్ 720 SoC లేదా స్నాప్‌డ్రాగన్ 730 జి నుండి పోటీ వుంటుంది కాబట్టి కేవలం ఒక్క 5G ఫీచర్ కోసం ఎక్కువ డబ్బును క్వాల్కమ్ వసూలు చేయడం సాధ్యం కాదు. ఈ రెండు చిప్ సెట్ ల ఫోన్లు ప్రస్తుతం రూ .20,000 కన్నా తక్కువ ధరలో లభిస్తున్నాయి.
కొత్త స్నాప్‌డ్రాగన్ 690 శక్తితో పనిచేసే స్మార్ట్ ఫోన్లను విదురాహల్ చేయాలని యోచిస్తున్న కంపెనీల్లో HMD గ్లోబల్, LG , మోటరోలా, TCL లు ఉన్నాయని, 2020 ద్వితీయార్థంలో ఇవి విడుదల కానున్నాయని Qualcomm తెలిపింది.