ఆధార్ కార్డు లో సమస్యా ..చిటికెలో వివరాలన్ని అందుకోండి..!

HIGHLIGHTS

ఆధార్ కార్డు లో సమస్యా ?

ఆధార్ వివరాలన్ని చిటికెలో పొందవచ్చు

మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందవచ్చు

ఆధార్ కార్డు లో సమస్యా ..చిటికెలో వివరాలన్ని అందుకోండి..!

ఆధార్ కార్డు లో సమస్యా ? అయితే, ఆధార్ వివరాలన్ని చిటికెలో పొందవచ్చు. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఒక్క ఫోన్ కాల్ మాత్రమే. UIDAI ఆధార్ సేవల కోసం ఒక కొత్త ఆధార్ హెల్ప్ లైన్ నంబర్ ను తీసుకొచ్చింది. మీకు మీ ఆధార్ కార్డ్ గురించి ఎటువంటి సమస్య ఉన్నా లేదా ఏదైనా వివరాలు తెల్సుకోవలసి వచ్చినా కూడా ఈ నంబర్ మీకు ఉపయోగపడుతుంది. #Dail1947AadhaarHelpLine పేరుతొ ఈ సర్వీస్ నంబర్ ను ప్రకటించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అంటే, మీ ఆధార్ కార్డు గురించి ఏదైనా సమస్య ఉంటే 1947 నంబర్ కి కాల్ చెయ్యడం ద్వారా మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందవచ్చు.  ఇక మీరు మీ ఆధార్ కి సంభందించి ఎక్కడెక్కడ మీ ఆధార్ కార్డ్ ను ఉపయోగించారో తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింది విధంగా ఆన్లైన్లో చాలా సులభంగా తెలుసుకోవచ్చు.

ఈ క్రింది విధంగా చేయాలి

1.  ముందుగా ప్రభుత్వ అధికారిక UIDAI యొక్క Website ఓపెన్ చేయాలి.

2.  పేజ్ ఓపెన్ అయిన తరువాత సూచించిన దగ్గర మీ 12 అంకెల ఆధార్ కార్డు నంబర్ నమోదు చేయాలి మరియు అక్కడ ఇచ్చిన సెక్యూరిటీ కోడ్ కూడా నమోదు చేసి ఎంటర్ చేయాలి.

3. ఈ విధంగా చేసినతరువాత మీకు మీ యొక్క నమోదుకాబడిన (Registered) మొబైల్ నంబర్ కి OTP వస్తుంది. ఈ OTP కేవలం ముందుగా నమోదు చేయబడిన మొబైల్ నంబరుకు మాత్రమే వస్తుంది.

 4. మీ మొబైల్ కి వచ్చిన OTP ఎంటర్ చేసిన తరువాత మీరు ఆధార్ పేజీ వివరాల్లోకి వెళతారు, ఇక్కడ మీరు మీకు సంబంధించిన వివరాలను చూడొచ్చు.

5. అయితే , ఇక్కడ మీరు ఏయే వివరాలు కావాలనుకుంటున్నారో వాటిని మీరు ఎంచుకోవలసి ఉంటుంది.

6. ఉదాహరణకి : డేట్ ఎంచుకోవడం ద్వారా ఈ డేట్ పరిధిలో ఏవిధమైన సౌకర్యాలకు ఈ కార్డు వాడంబడిదో తెలుస్తుంది.

7. అయితే ఇక్కడ ఎవరు వాడారన్న విషయం మాత్రం తెలుసుకునే వీలులేదు.

గమనిక : సెక్యూరిటీ కారణంగా, ఈ వెబ్సైట్ కొన్నిసార్లు ఓపెన్ కాకపోవచ్చు.                

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo