Amazon Sale 2023: ఈరోజు అర్ధరాత్రి నుండి ప్రైమ్ మెంబెర్స్ కోసం సేల్ మొదలువుతుంది.!

HIGHLIGHTS

రిపబ్లిక్ డే 2023 సందర్భంగా అమెజాన్ ప్రకటించిన Great Republic Day 2023

ఈరోజు అర్ధరాత్రి నుండి ప్రైమ్ మెంబెర్స్ కోసం ఈ సేల్ మొదలువుతుంది

Amazon Great Republic Day 2023 సేల్ నుండి చాలా ప్రోడక్ట్స్ పైన బెస్ట్ డీల్స్ పొందవచ్చు

Amazon Sale 2023: ఈరోజు అర్ధరాత్రి నుండి ప్రైమ్ మెంబెర్స్ కోసం సేల్ మొదలువుతుంది.!

Amazon Sale 2023: రిపబ్లిక్ డే 2023 సందర్భంగా అమెజాన్ ప్రకటించిన Great Republic Day 2023 సేల్ కోసం ఈరోజు అర్ధరాత్రి నుండి ప్రైమ్ మెంబెర్స్ కు యాక్సెస్ అందుతుంది. అంటే, క్లియర్ గా  చెప్పాలంటే ఈరోజు అర్ధరాత్రి నుండి ప్రైమ్ మెంబెర్స్ కోసం ఈ సేల్ మొదలువుతుంది. ఈ సేల్ నుండి ఒకరోజు ముందుగానే బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లను అందుకునే అవకాశం ప్రైమ్ సభ్యులకు అమెజాన్ ప్రత్యేకంగా అందిస్తుంది. మీరు కూడా ప్రైమ్ మెంబర్స్ అయినట్లయితే, ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుండి Amazon Great Republic Day 2023 సేల్ నుండి చాలా ప్రోడక్ట్స్ పైన బెస్ట్ డీల్స్ పొందవచ్చు. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ప్రైమ్ మెంబర్స్ కోసం ఈరోజు నుండి మోదలవనున్న Amazon Great Republic Day 2023 సేల్ నుండి మంచి ఆఫర్లను ఇవ్వనున్నట్లు చెబుతోంది. ఇందులో అప్ కమింగ్ డీల్స్ లో భాగంగా బ్లాక్ బాస్టర్ డీల్స్, బడ్జెట్ బజార్, ప్రీ-బుక్ మరియు 8PM డీల్ వంటివి ఉంటాయని వెల్లడించింది. ఈ సేల్ ను SBI బ్యాంక్ భాగస్వామ్యంతో అందిస్తోంది. అందుకే, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI అప్షన్ తో ప్రోడక్ట్స్ కొనుగోలు చేసే వారికీ 10% అదనపు డిస్కౌంట్ ను అఫర్ చేస్తుంది.

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి టీవీలు మరియు గృహోపకరణాల పైన గరిష్టంగా 65% వరకూ డిస్కౌంట్ అందించనున్నట్లు సేల్ టీజింగ్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది. అలాగే, Alexa, FireTv మరియు Kindlle వంటి సొంత ప్రోడక్ట్స్ పైన గరిష్టంగా 45% వరకు డిస్కౌంట్ అఫర్ చేయనున్నట్లు కూడా చెబుతోంది. 

ఇక కొత్త ప్రోడక్ట్స్ మరియు లాంచెస్ విషయానికి వస్తే, ఈ సేల్ నుండి 60 కి పైగా కొత్త ప్రోడక్ట్స్ సేల్ కి అందుబాటులో ఉంటాయని మరియు మంచి ఆఫర్లు కూడా ఈ ప్రోడక్ట్స్ పైన అందుకోవచ్చని తెలుస్తోంది. ఇందులో, కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్, సౌండ్ బార్స్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo