ఇక కార్లలో కూడా శుభ్రమైన గాలిని పీలుచుకోవచ్చు

ఇక కార్లలో కూడా శుభ్రమైన గాలిని పీలుచుకోవచ్చు
HIGHLIGHTS

కాలుష్య కారకాలు లేదా హానికరమైన కణాలు కారు లోపలి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశించనివ్వవు.

భారతదేశంలో వాయు కాలుష్యం గురించి అవగాహన కలిగించే సంస్థ అయిన ప్యూర్ లాజిక్ ల్యాబ్స్ ఇండియా, కాలుష్య నుండి మీ రక్షణ కోసం PM2.5 దుమ్ము కాలుష్య స్థాయిలను తనిఖీ చేయడానికి పాకెట్ మానిటర్‌ ను ప్రారంభించిన వెంటనే, ఈ సంవత్సరం మరో ప్రొడక్టును విడుదల చేసింది. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా శుభ్రంగా మరియు సురక్షితంగా ఉండేలా ప్రాణ ఎయిర్ ఇప్పుడు కారు కోసం క్యాబిన్ ఫిల్టర్లను విడుదల చేసింది.

ప్రాణ ఎయిర్ యొక్క కొత్త కార్ క్యాబిన్ ఫిల్టర్లు, గాలిలో వుండే హానికరమైన కాలుష్య కారకాలను మరియు PM2.5 మరియు PM10 వంటి కణాలను అలాగే NO2 మరియు SO2 వంటి వాయువులను వాహనం లోపల ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. ఈ ఫిల్టర్లు కారు క్యాబిన్ లోపల ఉంచబడతాయి, మల్టి – లేయర్డ్ HEPA మరియు యాక్టివేట్ కార్బన్ ఫిల్టర్‌ల ద్వారా స్వచ్ఛమైన గాలిని మాత్రమే దీని ద్వారా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. కారు ఎయిర్ ప్యూరిఫైయర్లతో పోలిస్తే, ఈ ఫిల్టర్లు ఏ సమయంలోనైనా కాలుష్య కారకాలు లేదా హానికరమైన కణాలు కారు లోపలి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశించనివ్వవు.

సాధారంగా, ఇళ్లలో లేదా ఇతర ప్రదేశాలలో స్వచ్ఛమైన గాలి కోసం ఎయిర్ ప్యూరీ ఫయర్లు మనకు సహాయపడతాయి. అయితే, ప్రత్యక్షంగా డస్ట్ మరియు పొల్యూషన్ లో తిరిగే, కారు లోపల స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవటానికి చాలా మంది ప్రజలు ఒక మంచి పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి వారికీ ఇది నిజంగా ఒక వరంలా ఉంటుంది. ఈ ప్రాణ ఎయిర్ కార్ ఫిల్టర్‌ను క్యాబిన్‌లో ఉంచడం వలన  ఇది శుద్ధమైన మరియు స్వచ్ఛమైన గాలిని వాహనంలోకి  అనుమతిస్తుంది.

ఈ ప్రాణ ఎయిర్ క్యాబిన్ ఫిల్టర్, భారతదేశంలోని ప్రతి ప్రధాన కార్ మోడల్‌కు తగిన అన్ని పరిమాణాల్లో వస్తుంది. అలాగే, దీన్ని ఫిక్స్ చెయ్యడం కూడా చాలా సులభం, ఈ ఫిల్టర్ కేవలం వెంటిలేషన్ సిస్టంలోమాత్రమే ఉంచబడుతుంది, ఇది సాధారణంగా గ్లోవ్ కంపార్ట్మెంట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఇది మీ ద్వారా లేదా మీ కారు సర్వీస్ చేసే వారి ద్వారా చేయవచ్చు.

ప్రాణ ఎయిర్ యొక్క ఫిల్టర్లను www.pranaair.com వెబ్‌సైట్‌లో 1990 రూపాయలకు కొనవచ్చు, ఇది భారతదేశంలోని అన్ని ప్రధాన కార్ మోడళ్లకు అనువైనది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo