Pm Kisan Yojana: రైతులకు కేంద్రం కీలక అప్‌డేట్ .. అకౌంట్ లో డబ్బులు పడేది ఎప్పుడంటే.!

HIGHLIGHTS

Pm Kisan Yojana అర్హులైన వారికి కేంద్రం కీలక అప్డేట్ అందించింది

ఇప్పటికే 22 విడతలుగా రైతులకు డబ్బులు అకౌంట్ ద్వారా అందజేసింది

ఇప్పుడు 23 వ విడత అమౌంట్ ను రిలీజ్ చేయడానికి యోచన చేస్తున్నట్లు చెబుతున్నారు

Pm Kisan Yojana: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులైన వారికి కేంద్రం కీలక అప్‌డేట్ అందించింది. ఈ పథకం ద్వారా ఇప్పటికే 22 విడతలుగా రైతులకు డబ్బులు అకౌంట్ ద్వారా అందజేసింది. ఇప్పుడు 23 వ విడత అమౌంట్ ను రిలీజ్ చేయడానికి యోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, 23 వ విడత అమౌంట్ రిలీజ్ చేసే నాటికి రైతులు వారి కిసాన్ అకౌంట్ కి సంబంధించిన ఒక అప్‌డేట్ ను పూర్తి చేయాలని తెలిపింది.

Pm Kisan Yojana: ఏమిటా అప్డేట్?

గత విడతల్లో కొంతమంది రైతుల అకౌంట్లో జమ చేయబడిన అమౌంట్ గురించి సరైన సమాచారం అందుకోలేక పోయినట్లు ఆ రైతులు కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. అందుకే, ఈ విడత అకౌంట్ జమ గురించి ఎటువంటి కన్ ఫ్యూజ్ కాకుండా చూడటానికి కేంద్రం ఈ కొత్త అప్‌డేట్ ని అందించింది. అదేమిటంటే, 23 వ విడత అమౌంట్ వచ్చిన సంగతి వారి మొబైల్ ఫోన్లలో నేరుగా మెసేజ్ వచ్చేలా చర్యలు తీసుకుంది.

అయితే, ఇలా మొబైల్ ఫోన్ కు నేరుగా మెసేజ్ అందుకోవాలంటే, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధిదారులు e-KYC అప్‌డేట్ ను కచ్చితంగా పూర్తి చేయాలి. ఇందులో రైతుల వివరాలు అప్‌డేట్ చేయడం తో పాటు లేటెస్ట్ మొబైల్ నెంబర్ ను కూడా అందించాలి. ప్రభుత్వం ఇప్పుడు e-KYC ప్రక్రియను తప్పనిసరిగా చేయాలని రూల్ పెట్టింది. ఇది కేవలం అమౌంట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే కాదు నకిలీ లబ్ధిదారులను కట్టడి చేయడానికి కూడా మార్గం అవుతుంది. రైతులు CSC కేంద్రాల ద్వారా కూడా లబ్ధిదారుని స్థితి, కొత్త రిజిస్ట్రేషన్ మరియు వాయిదా వివరాలు చెక్ చేసుకోవచ్చు.

Pm Kisan Yojana: పథకం వల్ల లాభం ఏమిటి?

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది రైతుల ప్రయోజనార్ధం భారత ప్రభుత్వం అందించిన ప్రత్యేకమైన పథకం. 2019 లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా చిన్న మరియు సన్న కారు రైతులకు ప్రతి ఏడాది రూ.6,000 ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ అమౌంట్ ను మూడు విడతలు గా అందిస్తుంది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ అమౌంట్ జమ చేయబడుతుంది.

విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు మరియు ఇతర వ్యవసాయ అవసరాల కోసం ప్రభుత్వం ఈ డబ్బును రైతులకు అందిస్తుంది. అంతేకాదు, మధ్యలో ఎటువంటి జోక్యం లేకుండా డబ్బులు నేరుగా రైతుల అకౌంట్లో జమ చేస్తుంది.

Also Read: ANC vs ENC: కాల్స్ కోసం ఏది బెస్ట్.. ఇయర్‌ బడ్స్ తీసుకునే ముందు ఇవి వివరం తెలుసుకోండి.!

అకౌంట్ లో డబ్బులు పడేది ఎప్పుడు?

జూన్ 18న ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల అకౌంట్లో డబ్బులు జమ కావచ్చని సోషల్ మీడియాలో చాలా కథనాలు వస్తున్నాయి. అయితే, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఈ విషయం గురించి ఎటువంటి అఫీషియల్ స్టేట్‌మెంట్ లేదా అప్డేట్ రాలేదు. అమౌంట్ రిలీజ్ గురించి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే వరకు రైతులు ఎదురు చూడాల్సి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :