Petrol Price Hike: ఆన్‌లైన్ లో రియల్ టైమ్ పెట్రోల్ ధర ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.!
ఈరోజు ఉదయం 6 గంటల నుంచి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి
భారంగా మారిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఇంకా పెరగడంతో ప్రజల పై మరింత ప్రభావం చూపుతుంది
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర పన్నుల కారణంగా ధరలు మరింత ఎక్కువగా పెరిగాయి
Petrol Price Hike: దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో భారంగా మారిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఇంకా పెరగడంతో ప్రజల పై మరింత ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు, పన్నులు, డాలర్ మారకం విలువ వంటి ప్రధాన కారణాల వల్ల ఇంధన ధరలు మారుతూ ఉంటాయి. తాజాగా దేశవ్యాప్తంగా లీటర్ కు సుమారు రూ. 3 వరకు పెరుగుదల నమోదైంది.
SurveyPetrol Price Hike: ఏమిటి కొత్త అప్డేట్?
నిన్న వరకు యధావిధిగా కొనసాగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అమాంతం పెరిగిపోయాయి. పెట్రోల్ బ్యాంకుల్లో పెట్రోల్ కోసం వెళ్లిన ప్రజలు ఈ వార్త విని నిర్ఘాత పోయినట్లు తెలిపారు. అయితే, ఇదేదో ఒక రాష్ట్రంలో జరిగిన సంఘటన అని మాత్రం అనుకోకండి. ఈ ప్రైస్ యావత్ దేశం మొత్తం నమోదయ్యింది. ఈ కొత్త ప్రైస్ హైక్ తో కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 110 రూపాయలు దాటేసింది.

ఈ పరిస్థితుల్లో ప్రతి రోజు పెట్రోల్ ధర తెలుసుకోవడం చాలా అవసరం అవుతుంది. ఇప్పుడు మొబైల్ లేదా వెబ్ సైట్ ద్వారా రియల్ టైమ్ లో మీ నగరంలోని పెట్రోల్ ధర మీరు ఈజీగా తెలుసుకోవచ్చు.
పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, యుద్ధాలు మరియు గ్లోబల్ ఉద్రిక్తతలు పెట్రోల్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు అని చెప్పవచ్చు. అయితే, రూపాయి విలువ తగ్గడం మరియు ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు కూడా ఇతర కారణాలు గా చూడొచ్చు.
ఉదయం 6 గంటలకే రేటు ఎందుకు మారింది?
2017 నుంచి భారత్‌లో ప్రతి రోజు ఉదయం 6 గంటలకు పెట్రోల్ ధరలు అప్డేట్ అవుతున్నాయి. ఈ సమయంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజువారీ రేట్లు నిర్ణయిస్తాయి. అందుకే, ఈరోజు కూడా ఉదయం 6 గంటలకు పెట్రోల్ ప్రైస్ మారింది.
Also Read: భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం 23 వేలకే Samsung 4K Smart Tv అందుకోండి.!
ఆన్ లైన్‌లో రియల్ టైమ్ పెట్రోల్ ధర ఎలా చెక్ చేయాలి?
Indian Oil, BPCL మరియు HPCL అధికారిక వెబ్ సైట్ మరియు యాప్ ద్వారా మీరు పెట్రోల్ ధరలో రియల్ టైమ్ లో తెలుసుకోవచ్చు. ఇందులో మీ లొకేషన్ అందించి మీ నగరాన్ని ఎంపిక చేయాలి. అంతే, మీ లోకల్ పెట్రోల్ బంక్ లో ప్రైస్ వివరాలు అందిస్తుంది. ఇది కాకూండా యాప్స్ లో ఫ్యూయల్ ప్రైస్ ట్రాకింగ్, సమీప పెట్రోల్ బంక్, ఆఫర్స్, క్యాష్ బ్యాక్ మరియు లైవ్ రేట్లు వివరాలు కూడా మీకు లభిస్తాయి.

SMS ద్వారా కూడా పెట్రోల్ ధర తెలుసుకోవచ్చు. అంటే, ఇంటర్నెట్ లేకపోయినా SMS ద్వారా తెలుసుకోవచ్చు. RSP (City Code) అని టైప్ చేసి 9224992249 కు పంపాలి. ఈ సేవను Indian Oil Corporation అందిస్తోంది. సిటీ కోడ్ కంపెనీ సైట్ లో లభిస్తుంది. మన తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల కోడ్స్ చుస్తే, వైజాగ్ కోడ్ (RSP 127290), హైదరాబాద్ (RSP 134483) మరియు విజయవాడ (RSP 127611) తో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర పన్నుల కారణంగా ధరలు మరింత ఎక్కువగా పెరిగాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile