Paytm కస్టమర్లకు గొప్ప శుభవార్త.!

HIGHLIGHTS

అడిగిన వెంటనే వడ్డీ లేకుండా రుణం

పేటిఎం నుండి రుణం

సర్వీస్ ఛార్జ్ కానీ వడ్డీ కానీ లేదు

Paytm కస్టమర్లకు గొప్ప శుభవార్త.!

అడిగిన వెంటనే వడ్డీ లేకుండా రుణం ఇవ్వడానికి పేటిఎం సిద్ధమయ్యింది. కస్టమర్లకు చేతిలో డబ్బులేని సయంలో చిన్న మొత్తం రుణంగా ఇవ్వడానికి  పేటిఎం కొత్త ఫీచర్ తెచ్చింది. ఒక్క మాటలో క్లియర్ గా చెప్పాలంటే, చేతిలో డబ్బులేనప్పుడు చిన్న మొత్తాని పేటిఎం నుండి రుణంగా పొందవచ్చు. చిన్న మూత్తాన్ని రుణంగా అందించడం కోసం పేటిఎం కొత్తగా పోస్ట్ పెయిడ్ మిని సర్వీస్ పేరుతో కొత్త సర్వీస్ ను తీసుకొచ్చింది మరియు దీని ద్వారా చిన్న మొత్తాన్ని కస్టమర్లకు చిన్న మొత్తాన్ని రుణంగా అందిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 ఈ రుణాన్ని ఇన్స్టాంట్ గా పొందవచ్చు. ఇప్పటికే పేటిఎం నుండి కొనసాగుతున్న 'Buy Now Pay Later' సర్వీస్ కు ఇది మరొక భాగంగా చెప్పవచ్చు. పోస్ట్ పెయిడ్ మిని సర్వీస్ కోసం పేటిఎం ఆదిత్య బిర్లా ఫైనాన్స్ తో జతకట్టింది. ఈ సర్వీస్ ఎమర్జెన్సి అవసరాల కోసం బాగా ఉపయోగపడుతుంది.

ప్రస్తుత మహమ్మారి కష్టకాలంలో చేతిలో డబ్బు లేనప్పుడు కస్టమర్ల అవసరాలకు ఉయాయోగపడే ఉద్యేశ్యంతో సర్వీస్ తీసుకొచ్చినట్లు పేటిఎం పేర్కొంది. ఈ పేటిఎం మిని సర్వీస్ తో 250 రూపాయల నుండి 1000 రూపాయల వరకూ చిన్న మొత్తాన్ని రుణంగా పొందవచ్చు.  గ్యాస్ సిలిండర్ బుకింగ్, మొబైల్ ఫోన్ రీఛార్జ్, కరెంట్ బిల్ లేదా DTH వంటి చాలా ఇంటి అవసరాలకు ఈ రుణం ఉపయోగపడుతుంది.

పేటిఎం ఈ పోస్ట్ పెయిడ్ మిని సర్వీస్ ద్వారా అందించే చిన్న మొత్తానికి సర్వీస్ ఛార్జ్ కానీ వడ్డీని కానీ వసూలు చెయ్యదు. ఈ సర్వీస్ ద్వారా తీసుకున్న రుణాన్ని 30 రోజుల్లో తిరిగి చెల్లించినట్లయితే ఎటువంటి వడ్డీ ఉండదు. అలాగే ఎటువంటి యాక్టివేషన్ ఫీజ్ లేదా యాన్యువల్ ఫీజ్ కూడా ఉండదు. కానీ, నామమాత్రపు కన్వీనియన్స్ ఫీజ్ మాత్రం వర్తిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo