అడిగిన వెంటనే వడ్డీ లేకుండా రుణం: పేటిఎం కొత్త ఫీచర్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 29 Jul 2021
HIGHLIGHTS
  • అడిగిన వెంటనే లోన్

  • టైం లోపల చెల్లిస్తే వడ్డీ కూడా లేదు

  • పేటిఎం కొత్త ఫీచర్ తెచ్చింది

అడిగిన వెంటనే వడ్డీ లేకుండా రుణం: పేటిఎం కొత్త ఫీచర్
అడిగిన వెంటనే వడ్డీ లేకుండా రుణం: పేటిఎం కొత్త ఫీచర్

కస్టమర్లకు అడిగిన వెంటనే వడ్డీ లేకుండా రుణం ఇవ్వడానికి పేటిఎం కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అత్యవసర సమయంలో చేతిలో డబ్బులేనప్పుడు కొంత మొత్తాన్ని రుణంగా ఇవ్వడానికి  పేటిఎం ఈ కొత్త ఫీచర్ తెచ్చింది. ఈ విధంగా రుణాన్ని అందించడం కోసం పేటిఎం కొత్తగా పోస్ట్ పెయిడ్ మిని సర్వీస్ పేరుతో కొత్త సర్వీస్ ను తీసుకొచ్చింది. దీని కోసం ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్ తో జతకట్టింది. ఈ ఫీచర్ ద్వారా రూ.250 నుండి రూ.1,000 లోపు చిన్న మొత్తాన్ని కస్టమర్లకు చిన్న మొత్తాన్ని రుణంగా అందిస్తుంది.

ఈ పోస్ట్ పెయిడ్ మిని సర్వీస్ ద్వారా అడిగిన వెంటనే రుణాన్ని తక్షణమే పొందవచ్చు. ముందునుండే పేటిఎం నుండి కొనసాగుతున్న 'Buy Now Pay Later' సర్వీస్ కు ఇది మరొక భాగంగా చెప్పవచ్చు. పోస్ట్ పెయిడ్ మిని సర్వీస్ కోసం పేటిఎం ఆదిత్య బిర్లా ఫైనాన్స్ తో జతకట్టింది. ఈ సర్వీస్ ఎమర్జెన్సి అవసరాల కోసం బాగా ఉపయోగపడుతుంది.

ప్రస్తుత మహమ్మారి కష్టకాలంలో చేతిలో డబ్బు లేనప్పుడు కస్టమర్ల అవసరాలకు ఉయాయోగపడే ఉద్యేశ్యంతో సర్వీస్ తీసుకొచ్చినట్లు పేటిఎం పేర్కొంది. ఈ పేటిఎం మిని సర్వీస్ తో 250 రూపాయల నుండి 1000 రూపాయల వరకూ చిన్న మొత్తాన్ని రుణంగా పొందవచ్చు.  గ్యాస్ సిలిండర్ బుకింగ్, మొబైల్ ఫోన్ రీఛార్జ్, కరెంట్ బిల్ లేదా DTH వంటి చాలా ఇంటి అవసరాలకు ఈ రుణం ఉపయోగపడుతుంది.

పేటిఎం ఈ పోస్ట్ పెయిడ్ మిని సర్వీస్ ద్వారా అందించే చిన్న మొత్తానికి సర్వీస్ ఛార్జ్ కానీ వడ్డీని కానీ వసూలు చెయ్యదు. ఈ సర్వీస్ ద్వారా తీసుకున్న రుణాన్ని 30 రోజుల్లో తిరిగి చెల్లించినట్లయితే ఎటువంటి వడ్డీ ఉండదు. అలాగే ఎటువంటి యాక్టివేషన్ ఫీజ్ లేదా యాన్యువల్ ఫీజ్ కూడా ఉండదు. కానీ, నామమాత్రపు కన్వీనియన్స్ ఫీజ్ మాత్రం వర్తిస్తుంది.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: paytm new feature
Tags:
paytm postpaid mini paytm new feature loan పేటిఎం
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status