openai introduces GPT-6 Astra the most advanced ai model
GPT-6 Astra: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రకంపనలు పుట్టించిన open AI, ఇప్పుడు మరో సూపర్ ఏఐ మోడల్ ని పరిచయం చేసింది. సెప్టెంబర్ 3వ తేదీ ఈ కొత్త మోడల్ ని రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు ఓపెన్ ఏఐ పరిచయం చేసిన అన్ని మోడల్స్ కంటే కూడా ఇది చాలా వేగంగా మరియు తెలివిగా ఉంటుందని ఓపెన్ ఏఐ ఈ కొత్త మోడల్ గురించి పేర్కొంది. అంతేకాదు, ఇది మానవ మేధస్సుకు పోటీ పడి పని చేసే స్వభావం తో ఉంటుందని కూడా ఓపెన్ ఏఐ చెబుతోంది.
జిపిటి-6 అనేది ఓపెన్ ఏఐ రిలీజ్ చేసిన లేటెస్ట్ అండ్ అడ్వాన్స్ ఫ్లాగ్ షిప్ ఏఐ మోడల్. ఇటీవల ఓపెన్ ఏఐ అందించిన అన్ని చాట్ జిపిటి మోడల్స్ కంటే కూడా రెంటించిన శక్తితో మరియు తెలివితో ఉంటుందని ఓపెన్ ఏఐ తెలిపింది.
జిపిటి-5.6 లాంటి మోడల్ మీకు సమాధానం మాత్రమే అందిస్తుంది. అయితే, ఈ కొత్త మోడల్ జిపిటి-6 అస్త్ర ఒక పనిని చెబితే అది మొత్తం పనిని పూర్తి చేసి ఫలితం మీఁకు అందిస్తుంది. అంటే, ఉదాహరణకు మీకు అవసరమైన యాప్ లేదా సైట్ తయారు చేయమని ఈ కొత్త మోడల్ కి చెబితే, అది మొత్తం పనిని తీసుకుని, దాన్ని అనేక స్టెప్స్ గా ప్లాన్ చేసి, కంప్యూటర్ /బ్రౌజర్ /సాఫ్ట్ వేర్ లో పని పూర్తి చేయడానికి రూపొందించబడింది. ఇది మొత్తం పనిని తనంతటతానే పూర్తి చేసి కచ్చితమైన ఫలితాలు యూజర్ కి అందిస్తుంది.
ఈ కొత్త ఈ పనిని పూర్తి చేయడానికి అస్త్ర రీసర్చ్ – కోడింగ్ – వెబ్సైట్ క్రియేషన్ – టెస్టింగ్ వంటి అనేక దశలను చాలా సులభంగా మరియు కచ్చితంగా హ్యాండిల్ చేయగలదని ఓపెన్ ఏఐ తెలిపింది.
Also Read: జబర్దస్త్ తగ్గింపు ఆఫర్ తో 5.1 Dolby Audio సౌండ్ బార్ ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తోంది.!
ఇది ముఖ్యంగా కోడింగ్, రీసర్చ్ మరియు పెద్ద ప్రాజెక్టులు ఆటోమెటిగ్గా పూర్తి చేయడం కోసం ఓపెన్ ఏఐ ఇప్పటి వరకు అందించిన అన్ని మోడల్స్ కంటే అత్యంత శక్తివంతమైన మరియు తెలివైన మోడల్ గా తెలిపింది. ఇది చాలా పనులు మనుషుల అవసరం లేకుండా పూర్తి చేస్తుంది.
ఇది ఇప్పటి వరకు వచ్చిన ఏఐ మోడల్స్ చేయలేని ఒక కొత్త పని చేస్తుంది. అదే అడ్వాన్స్డ్ కమ్యూటర్ యూసేజ్. అంటే, ఇది మనుషుల అవసరం లేకుండా ఆన్లైన్ లో నింపే ఫారాలు కూడా మౌస్ తో పని లేకుండా కర్సర్ ను కదిలిస్తూ ఆటోమేటిగ్గా నింపేస్తుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, మనిషి మాదిరిగా కంప్యూటర్ స్క్రీన్ ని అర్థం చేసుకొని ఆటోమెటిగ్గా పనులు చేసేస్తుంది.
ఇది సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ రంగంలో అత్యంత ప్రతిభ కనబరిచే మోడల్ గా ఉంటుంది మరియు అత్యున్నతమైన ప్రతిభ కనబరుస్తుంది. కేవలం ఒక చిన్న ప్రాంప్ట్ తో యాప్స్, వెబ్సైట్ మరియు 3D గేమ్స్ ను సైతం క్రియేట్ చేసి ఇవ్వగలదు.
సెక్యూరిటీ పరంగా ఓపెన్ ఏఐ యొక్క సంసిద్ధత మరియు ఫ్రేమ్ వర్క్ లో ఉచ్చస్థాయి అందుకున్న మొదటి మోడల్ ఇదే అని ఓపెన్ ఏఐ తెలిపింది. ఇది సిస్టం లో లోపాలు గుర్తించడంలో నూటికి నూరు శాతం స్కోర్ సాధించినట్లు కూడా పేర్కొంది.