జబర్దస్త్ తగ్గింపు ఆఫర్ తో 5.1 Dolby Audio సౌండ్ బార్ ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తోంది.!
జబర్దస్త్ తగ్గింపు ఆఫర్ తో 5.1 Dolby Audio సౌండ్ బార్ ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తోంది
పవర్‌ఫుల్ 5.1 డాల్బి సౌండ్ బార్ కోరుకునే వారు ఈ లేటెస్ట్ సాంబార్ ఆఫర్ ని పరిశీలించవచ్చు
ఈ సాంబార్ లాంచ్ అయిన తర్వాత ఎంత తక్కువ ధరల లభించడం ఎన్నడూ చూడలేదు
జబర్దస్త్ తగ్గింపు ఆఫర్ తో 5.1 Dolby Audio సౌండ్ బార్ ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ లాంచ్ అయిన తర్వాత ఎంత తక్కువ ధరల లభించడం ఎన్నడూ చూడలేదు. ఈ లేటెస్ట్ సౌండ్ బార్ మంచి స్పీకర్ సెటప్ మరియు జబర్దస్త్ సౌండ్ అందించే డాల్బీ డిజిటల్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. కేవలం 7,000 రూపాయల బడ్జెట్ లో పవర్‌ఫుల్ 5.1 డాల్బి సౌండ్ బార్ కోరుకునే వారు ఈ లేటెస్ట్ సాంబార్ ఆఫర్ ని పరిశీలించవచ్చు.
Survey5.1 Dolby Audio : ఆఫర్
ఈ సౌండ్ బార్ ఆఫర్ విషయానికి వస్తే, మోటోరోలా ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా విడుదల చేసిన 5.1 డాల్బీ ఆడియో సౌండ్ బార్ Amphisound X Vibe ఈరోజు ఈ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను ఈ రోజు ఫ్లిప్ కార్ట్ 80% అతి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 రూపాయల డిస్కౌంట్ ధరలో సేల్ చేస్తోంది.

ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ను ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారు రూ. 640 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 7,359 రూపాయల: అతి చవక ధరలో మీకు లభిస్తుంది.
Also Read: AI Telugu భాషకు వరమా లేక శాపమా ..టెక్నాలజీ మన భాషను ఎలా మార్చేస్తోంది.!
5.1 Dolby Audio : ఫీచర్స్
ఈ మోటరోలా సౌండ్ బార్ 5.1 సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో ముందు నాలుగు స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు డీప్ బాస్ సౌండ్ అందించే సపరేట్ సబ్ ఊపర్ ని కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన కంప్లీట్ సెటప్ తో 550 వాట్ జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఇది క్రిస్టల్ క్లియర్ ఆడియో అవుట్ పుట్, థండర్ బాస్ టెక్నాలజీ మరియు ఆప్టిమైజ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వంటి ప్రీమియం ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
ఇక ఈ మోటరోలా 5.1 సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ లో డాల్బీ ఆడియో మరియు డాల్బీ డిజిటల్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లను మోటరోలా అందించింది. అదనంగా, ఈ సౌండ్ బార్ న్యూస్ మోడ్, మ్యూజిక్ మోడ్ మరియు మూవీ మోడ్ అనే మూడు ప్రత్యేకమైన ఈక్వలైజర్ మోడ్స్ తో కూడా వస్తుంది. ఈ ఫీచర్స్ తో ఈ సౌండ్ బార్ సినిమా థియేటర్ వంటి జబర్దస్త్ సౌండ్ ఆఫర్ చేస్తుందని మోటరోలా తెలిపింది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో బ్లూటూత్, HDMI Arc, USB, ఆప్టికల్ మరియు AUX వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
