వన్‌ప్లస్ నార్డ్ 2 ఫ్లాగ్ షిప్ ఫీచర్లతో రేపు లాంచ్ అవుతోంది

వన్‌ప్లస్ నార్డ్ 2 ఫ్లాగ్ షిప్ ఫీచర్లతో రేపు లాంచ్ అవుతోంది
HIGHLIGHTS

వన్‌ప్లస్ నార్డ్ 2 రేపు లాంచ్ అవుతుంది

మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్

50MP సోనీ IMX766 ఫ్లాగ్ షిప్ సెన్సార్

వన్‌ప్లస్ నార్డ్ 2 జూలై 22 న, అంటే రేపు  లాంచ్ అవుతుంది. వన్‌ప్లస్ సంస్థ వన్‌ప్లస్ నార్డ్ 2 యొక్క ఫీచర్లను ఇప్పటికే అధికారికంగా వెల్లడించగా, దీని ప్రైస్ గురించి ఆన్లైన్ లో వచ్చిన కొన్ని లీక్స్ వెల్లడించాయి. మొత్తంగా, వన్‌ప్లస్ నార్డ్ 2 ప్రస్తుతం హాట్ టాపిగ్గా నిలైహ్చింది. ఈ ఫోన్ వన్‌ప్లస్ నుండి మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ తో విడుదలవనున్న మొదటి ఫోన్‌గా నిలుస్తుంది.

ఇక లీకైన ప్రైస్ వివరాల్లోకి వెళితే, వన్‌ప్లస్ నార్డ్ 2 యొక్క బేస్ వేరియంట్‌ 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్‌తో 31,999 రూపాయల నుండి ప్రారంభమవుతుందని కొన్ని రిపోర్ట్స్ వెల్లడించాయి. అంతేకాదు, 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ ఉన్న హాయ్ ఎండ్ మోడల్ ధర రూ .34,999 గా ఉంటుందని చెబుతున్నారు.

వన్‌ప్లస్ నార్డ్ 2: టీజ్డ్ స్పెక్స్

వన్‌ప్లస్ నార్డ్ 2 లో AMOLED డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌ తో  వస్తుంది మరియు ఇది HDR10 + సర్టిఫికేట్ కలిగిఉండవచ్చు. అంతేకాదు, ఇది గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ తో ఉంటుందని భావిస్తున్నారు మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ రీడర్‌ను కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్ నార్డ్ 2 మీడియాటెక్ డైమెన్సిటీ 1200 5 జి ప్రాసెసర్‌తో పనిచేస్తుందని వన్‌ప్లస్ ధృవీకరించింది. ఇది 12 జిబి ర్యామ్ మరియు 256 జిబి స్టోరేజ్ వేరియంట్‌లతో జతచేయబడతాయి. నార్డ్ 2 ఆక్సిజన్ ఓఎస్ 11 తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 పై ఆధారపడి ఉంటుంది మరియు ఇది ఆక్సిజన్ ఓఎస్ మరియు కలర్‌ఓఎస్ యొక్క ఏకీకృత కోడ్‌బేస్‌తో సరికొత్త వెర్షన్.

కెమెరాల విషయానికొస్తే, వన్‌ప్లస్ లేటెస్ట్ టీజ్ ద్వారా నార్డ్ 2 వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరాలు ఉన్నాయని, అవి 50MP సోనీ IMX766 సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా మరియు 2MP మాక్రో కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ లోని ప్రాధమిక కెమెరా సెన్సార్  వన్‌ప్లస్ 9, 9 ప్రో మరియు ఫైండ్ ఎక్స్ 3 ప్రో లో చూసినట్లుగానే ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo