21 రోజుల ఇండియా లాక్ డౌన్ : Hotstar మరియు Zee5 లో చూడదగిన టాప్ 5 షోలు
మీరు కొత్తగా విడుదలైనటువంటి చాలా సినీమాలను కూడా ఎంజాయ్ చెయ్యవచ్చు
కరోనావైరస్ కారణంగా మనమందరం కూడా దేశంలో విధించిన లాక్ డౌన్ యొక్క రెండవ వారంలోకి (రోజులు) అడుగు పెట్టాము. ఇప్పుడు ఇది మరింత ఉదృతంగా జరుగుతోంది మరియు ఇది కొంత కాలం పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో మీరు ఇంట్లో కాలక్షెపం చేయడం కోసం Hotstar మరియు Zee 5 లలో అందుబాటులో వున్నా కొన్ని ఉత్తమ షోలను ఆస్వాదించవచ్చు. దీని కోసం, మొదట మీరు Hotstar మరియు Zee 5 యొక్క సబ్ స్క్రిప్షన్ కలిగి ఉండాలి లేదా మీరు తీసుకోవాలి. ఈ సబ్ స్క్రిప్షన్ ఉన్న రెండు ప్లాట్ ఫామ్ లలో కొన్ని షోలు ఉచితంగా కూడా లభిస్తాయి. అంటే, భారతదేశంలో కొనసాగుతున్న 21 రోజుల లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన మీరు టైం పాస్\చెయ్యడానికి తగిన షోలను ఇక్కడ వివరిస్తున్నాను. \
SurveyMenthalhood
ఇది జీ 5 యొక్క ప్రసిద్ధ షో, ఈ షో తో కరిష్మా కపూర్ కూడా తన డిజిటల్ అరంగేట్రం చేసినట్లు చెప్పొచ్చు. ఇది దక్షిణ ముంబై కి చెందిన ఐదుగురు వ్యక్తులు ఉన్న ఒక షో. ఇందులో వారి పిల్లలు ఒక నాగరిక పాఠశాలలో చదువుతారు. ఈ షో గురించి మరింత తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.
The Final Call
Zee 5 లో ఈ షో చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. ఈ షో ద్వారానే అర్జున్ రాంపాల్ కూడా తన డిజిటల్ అరంగేట్రం చేసాడు. ఈ కథ ఒక విమాన ప్రయాణం చుట్టూ తిరుగుతుంది, మీరు దీన్ని ఆస్వాదించాలనుకుంటే ఈ వీడియోను చూడవచ్చు.
Mansoon Shootout
హాట్ స్టార్ ద్వారా మీరు ఈ షో ఆస్వాదించవచ్చు. ఇది ఒక థ్రిల్లర్ కథ, ఇది మీకు చాలా సరదాగా ఉంటుంది, మీరు ఈ షో ను చూడాలనుకుంటే మీరు మొదట ఈ వీడియోను చూడాలి.
Special ops
ఈ షోను హాట్ స్టార్ లో చూడవచ్చు. ఇది హాట్ స్టార్ యొక్క కొత్త సిరీస్. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఉంటుంది. ఈ షో, గత 19 సంవత్సరాలుగా దేశంలో ఉగ్రవాద దాడులను ఎదుర్కొంటున్న వాటికీ సంభందించినది. ఈ సిరీస్ లో, మీరు పార్లమెంటు దాడి, కాశ్మీర్ టెర్రర్ దాడి మరియు మరెన్నో వాస్తవ కథల ఆధారంగా రూపొందించిన వాటిని చూడవచ్చు. ఈ సిరీస్ కు సంబంధించిన వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చ.
Hotstar మరియు Zee5 : ఇతర షోలు
ఈ రెండు ప్లాట్ ఫామ్ లలో, విభిన్న ఇంగ్లీష్ మరియు హిందీ షోలతో పాటు, మీరు చాలా సినిమాలు కూడా ఆనందించవచ్చు. హాట్ స్టార్ లో కాఫీ విత్ కరణ్, మోడరన్ ఫ్యామిలీ, ఫ్లాష్, మాస్టర్ చెఫ్, రోర్ ఆఫ్ ది లయన్స్ వంటి అనేక షోలను కూడా మీరు ఆస్వాదించవచ్చు. ఇది కాకుండా, మీరు Zee5 గురించి చూస్తే ఇక్కడ మీరు ప్రతిరోజూ పండగే, ఏవంజర్స్ ఎండ్ గేమ్, కరెన్జిత్ కౌర్, ఇష్క్ ఆజ్ కల్, బద్నామ్ గాలి, ది షోలే గర్ల్ వంటి షోలు మరియు సినిమాలను ఆస్వాదించవచ్చు.