OLA తెచ్చిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంత దూరం ప్రయాణిస్తుందంటే.!

HIGHLIGHTS

ఇండియాలో OLA కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసింది.

ఈ స్కూటర్ సింగిల్ ఛార్జింగ్ తో 141 కిలో మీటర్ల దూరం ప్రయానించగలదు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి ఫీచర్లతో వచ్చింది

ఇండియాలో OLA తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసింది. అదే, కొత్త Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు ఈ స్కూటర్ సింగిల్ ఛార్జింగ్ తో 141 కిలో మీటర్ల దూరం ప్రయానించ గలదని కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి ఫీచర్లతో పాటుగా 90 km టాప్ స్పీడ్ తో ప్రయాణించగలదని కూడా ఓలా  తెలిపింది. ఇండియన్ మార్కెట్లో ఓలా కొత్తగా లాంచ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ విశేషాలు తెలుసుకోండి.

కొత్త Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్: ధర

ప్రముఖ ఎలక్ట్రానిక్ స్కూటర్ తయారీ సంస్థ OLA, ఇండియాలో తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ S1 EV ని రూ.99,999 ధరతో లాంచ్ చేసింది. ఈ కొత్త Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ S1 Pro మాదిరిగానే ఉంటుంది మరియు ఆగస్టు 15 మరియు ఆగస్టు 31 మధ్య రూ. 499 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఎలక్టిక్ స్కూటర్ ప్రస్తుతం మార్కెట్లో మంచి పేరు సంపాదించుకున్న Ola S1 Ather 450X Simple One TVS iCube మరియు Okinawa Okhi 90 వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడుతుంది.

Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్:

ఇక ఈ కొత్త Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ 2.98kWh బ్యాటరీని కలిగి ఉంది మరియు ఇది గంటకు 90 కి.మీ. గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది. అంతేకాదు, Ola S1 ఒక్కసారి పూర్తి ఛార్జ్‌తో 141 KM దూరాన్ని కవర్ చేయగలదని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మ్యూజిక్ ప్లేబ్యాక్, నావిగేషన్, కంపానియన్ యాప్ మరియు రివర్స్ మోడ్ వంటి MoovOS ఫీచర్లను కలిగివుంది. అలాగే, Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ పరంగా S1 Pro యొక్క డిజైన్ చాలావరకు ఒకేలా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :