Okinawa Okhi 90: 90 km/h టాప్ స్పీడ్ తో వస్తున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్!!

HIGHLIGHTS

Okinawa Okhi 90 90 km/h టాప్ స్పీడ్ తో ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్

Okhi 90 ఒక్కసారి ఛార్జింగ్ తో 200 కిలోమీటర్లు ప్రయాణించగలదు

కేవలం 4 గంటల్లోనే 80% ఛార్జింగ్

Okinawa Okhi 90: 90 km/h టాప్ స్పీడ్ తో వస్తున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్!!

ప్రస్తుతం తక్కువ స్పీడ్ సెగ్మెంట్లో మాత్రమే e-Scooter లను అందించిన Okinawa /ఇప్పుడు స్పీడ్ పెంచింది. Okinawa Scooters ఒక భారతీయ ఇ-స్కూటర్ తయారీ కంపెనీ మరియు ఇప్పటికే ఇ-స్కూటర్ మార్కెట్‌లో తక్కువ స్పీడ్ e-స్కూటర్ సెగ్మెంట్‌లో స్కూటర్ లను అందించింది. అయితే,ఇప్పడు ఒకినావా గరిష్టంగా 90 km/h టాప్ స్పీడ్ తో ప్రయాణించే శక్తి కలిగిన Okinawa Okhi 90 ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్చి 24 వ తేదీన ఇండియాలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కేవలం వేగం ఒక్కటి మాత్రమే కాదు ఈ ఒకినావా ఓఖి 90 ఇ-స్కూటర్‌ను 200 కిమీల లాంగ్ డిస్టెన్స్ ప్రయాణించే సామర్ధ్యంతో కూడా అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Okinawa సహ వ్యవస్థాపకుడు, జితేంద్ర శర్మ ఒక ఇంటర్వ్యూలో Okhi 90 E-Scooter గురించి కొన్ని ముఖ్యమైన వివరాలను వెల్లడించారు. Okhi 90 ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ తో గరిష్టంగా 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే శక్తితో ఉంటుందని తెలిపారు. Okhi 90 భారతదేశంలోని E-Scooter మార్కెట్ ఎల్లలను మార్చబోతోందని కూడా అభిప్రాయపడ్డారు. ఈ స్కూటర్ లాంచ్ గురించి షేర్ చేసిన ట్వీట్ ను క్రింద చూడవచ్చు.

 

 

ఇక ఈ అప్ కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ఫీచర్ల గురించి చూస్తే, ఈ ఓఖి 90 వేగంగా ఛార్జ్ చేసేందుకు వీలుగా ఫాస్ట్ ఛార్జింగ్ ఫంక్షనాలిటీని కలిగివుంటుంది. అంతేకాదు, ఈ ఇ-స్కూటర్ కనెక్టెడ్ వెహికల్ ఫీచర్స్ మరియు AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్) తో వస్తుంది. ఈ స్కూటర్ కేవలం 4 గంటల్లోనే 80% ఛార్జింగ్ అవుతుందని కూడా కంపెనీ పేర్కొంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo