ఎన్ని SIM కార్డ్స్ మీ పేరు మీద యాక్టివ్ గా ఉన్నాయో తెలుసా.!

ఎన్ని SIM కార్డ్స్ మీ పేరు మీద యాక్టివ్ గా ఉన్నాయో తెలుసా.!
HIGHLIGHTS

ఎన్ని SIM కార్డ్స్ మీ పేరు మీద యాక్టివ్ గా ఉన్నాయో తెలుసా

ఆన్లైన్లో చాలా సులభంగా తెలుసుకునే మార్గాలు ఉన్నాయి

మీరు తీసుకున్న మొబైల్ నంబర్ల కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెల్సుకోవచ్చు

ఎన్ని SIM కార్డ్స్ మీ పేరు మీద యాక్టివ్ గా ఉన్నాయో తెలుసా? తెలియకపోతే చాలా సింపుల్ గా తెలుసుకోవచ్చు. ప్రస్తుత ఆన్లైన్ యుగంలో ప్రతి విషయం కూడా ఆన్లైన్లో చాలా సులభంగా తెలుసుకునే మార్గాలు ఉన్నాయి. వాస్తవానికి, గతంలో ఇటివంటి సున్నితమైన వివరాలను తెలుసుకోవడం చాలా కష్టమైన పని. కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త వెబ్సైట్ ద్వారా ఇది సులభంగా మారింది.  ఈ వెబ్సైట్ ద్వారా మీరు తీసుకున్న మొబైల్ నంబర్ల కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెల్సుకోవచ్చు.

మీ మొబైల్ ఫోన్ బ్రౌజర్ లేదా ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో tafcop.dgtelecom.gov.in వెబ్ సైట్ ని తెరవండి. తరువాత, సూచించిన వద్ద మీ మొబైల్ నంబర్‌ నమోదు చేయండి. క్రింద OTP రిక్వెస్ట్ కోసం  సూచించిన బాక్స్ పైన నొక్కండి. మీ మొబైల్ నంబర్ కు వచ్చిన OTP ని ఎంటర్ చేసి తనిఖీ చేయండి.

OTP ని ధృవీకరించిన తరువాత, మీ పేరులో పనిచేసే అన్ని మొబైల్ నంబర్స్ యొక్క పూర్తి జాబితాను మీరు అందుకుంటారు. వాటిలో, మీరు మీ సౌలభ్యం ప్రకారం ఏదైనా నంబర్ గురించి రిపోర్ట్ చెయవచ్చు. తరువాత, మీరు కోరుకున్న నంబర్ మాత్రమే వాడుకలో ఉంటుంది మరియు మీరు ఫిర్యాదు చేసిన నంబర్లను ప్రభుత్వం తనిఖీ చేస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo