JioPhone Next: ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే లభిస్తోంది..!!

HIGHLIGHTS

JioPhone Next 4G ఇప్పుడు ఎన్నడూ చూడనంత తక్కవ ధరకే లభిస్తోంది

గూగుల్ మరియు రిలయన్స్ జియో సంయుక్తంగా తీసుకువచ్చిన బడ్జెట్ 4జి ఫోన్

జియోఫోన్ నెక్స్ట్ 2,600 రూపాయల భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది

జియోఫోన్ నెక్స్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ నుండి 2,600 రూపాయల భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఒకేవేళ మీరు జియో అధికారిక వెబ్సైట్ నుండి కొనాలనుకున్నా రిలయన్స్ కూడా ఈ ఫోన్ పైన భారీ ఎక్స్ చేంజ్ ఆఫర్ ని ప్రకటించింది. కాబట్టి, మీరు ఫోన్  ను మునుపెన్నడూ చూడనంత తక్కువ రేటుకే పొందవచ్చు. 4G స్మార్ట్ ఫోన్  ను కేవలం 4 వేల రూపాయల ధరలో పొందాలి అనుకునే వారికి ఇది నిజంగా గొప్ప స్మార్ట్ ఫోన్ ఆఫర్ అవుతుంది.     

JioPhone Next 4G ఫోన్ ను ప్రస్తుతం అమెజాన్ 41% డిస్కౌంట్ తో కేవలం రూ.4,398 రూపాయల అఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఈ ఫోన్ పైన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా అందించింది. ఈ ఫోన్ ను Citi బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 1,500 రూపాయల వరకూ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

ఇక జియో వెబ్సైట్ నుండి లభిస్తున్న అఫర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను ఏదైనా 4G ఫోన్ తో ఎక్స్ చేంజ్ చేస్తే, JioPhone Next కేవలం రూ.4,499 రూపాయలకే లభిస్తుంది. అంతేకాదు, నెలవారీ EMI పద్దతిలో ఎంచుకుంటే ముందుగా కేవలం రూ.1,999 రూపాయలు చెల్లించి ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు మరియు మిగిలిన డబ్బును 18 లేదా 24 నెలల వాయిదాల్లో ఈజీ EMI ద్వారా కూడా చెల్లించవచ్చు.

JioPhone Next: స్పెక్స్

ఇక JioPhone Next ఫీచర్ల విషయానికి వస్తే, జియోఫోన్ నెక్స్ట్ 5.45-అంగుళాల HD(720×1440) డిస్ప్లే కలిగి ఉంటుంది మరియు ఈ స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ 1.3 GHz క్లాక్ స్పీడ్ అందించగల Qualcomm QM215 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. అలాగే, ఈ ఫోన్  LPDDR3 2GB ర్యామ్ మరియు 32GB ఇన్ బిల్ట్ స్టోరేజ్ కలిగివుంటుంది. అలాగే, మైక్రో SD ద్వారా 512GB మెమోరిని విస్తరించవచ్చు.

ఈ ఫోన్ లో వెనుక 13MP సింగల్ కెమెరా మరియు ముందు సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరాలను అందించింది. ఈ కెమెరా HDR Mode, Night Mode, Portrait వంటి మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ లో 3000mAh బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ టెక్నాలజీతో ఇచ్చింది. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :