ఇక ఆండ్రాయిడ్ వంటకాల పేర్లతో రాదు కేవలం నంబర్ మాత్రమే : ఆండ్రాయిడ్ Q కాదు 10 మాత్రమే

ఇక ఆండ్రాయిడ్ వంటకాల పేర్లతో రాదు కేవలం నంబర్ మాత్రమే : ఆండ్రాయిడ్ Q కాదు 10 మాత్రమే
HIGHLIGHTS

ఆండ్రాయిడ్ ఇప్పుడు ఒక దశాబ్దం ముగించుకుంది, దాని పేరులోని ‘10’ ను కొంచెం సముచితంగా చేస్తుంది.

కొత్త గూగుల్ పిక్సెల్ 4 యొక్క లీకులు మరియు నివేదికల మధ్య, గూగుల్ ఆండ్రాయిడ్ యొక్క రాబోయే వెర్షన్ గురించి క్విక్ న్యూస్ ను పేల్చింది. ప్రస్తుతం బీటా పరీక్షలో ఉన్న ఆండ్రాయిడ్ క్యూ పేరు ఇప్పుడు ఆండ్రాయిడ్ 10 గా మార్చబడింది. పదేళ్ల క్రితం విడుదలైన తర్వాత మొదటిసారిగా, ఆండ్రాయిడ్ డెజర్ట్ లేదా షుగర్ ట్రీట్ పేరు లేకుండా షిప్పింగ్ చేస్తోంది.

తీపి వంటకాల పేర్లను ఉపయోగించడం మానేయాలని గూగుల్ ఎందుకు నిర్ణయించుకుందో ఇటీవలి బ్లాగ్ పోస్ట్‌లో వివరించారు. స్పష్టంగా, గూగుల్ అందుకున్న ఫీడ్‌బ్యాక్ నుండి, వినియోగదారులందరూ లాలిపాప్, కిట్‌క్యాట్ మరియు మార్ష్‌మల్లో వంటి పేర్లతో సంబంధం కలిగి ఉండరు. “గ్లోబల్ ఆపరేటింగ్ సిస్టమ్‌గా, ఈ పేర్లు ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ స్పష్టంగా మరియు సాపేక్షంగా ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి, ఆండ్రాయిడ్ యొక్క ఈ తదుపరి విడుదల వెర్షన్ నంబర్‌ను మాత్రమే  ఉపయోగిస్తుంది మరియు ఆండ్రాయిడ్ 10 అని పిలువబడుతుంది ”అని ఆండ్రాయిడ్ యొక్క ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ సమీర్ సమత్ వివరించారు.

అలాగే, ఇవికాకుండా గూగుల్ ఆండ్రాయిడ్ బ్రాండ్‌ను పునః రూపకల్పన చేసిన ఫాంట్ మరియు పేరు మరియు కొద్దిగా పాత డ్రాయిడ్ మస్కట్‌తో కొద్దిగా భిన్నమైన రంగులతో పునరుద్ధరించింది. క్రొత్త అధికారిక లోగోలో, ఆండ్రాయిడ్ ఇప్పుడు నలుపు రంగులో వ్రాయబడింది మరియు డ్రాయిడ్ ముఖం వేరే ఆకుపచ్చ నీడలో ఉంది. “మేము లోగోను ఆకుపచ్చ నుండి నలుపుకు మార్చాము. ఇది ఒక చిన్న మార్పు, కానీ ఆకుపచ్చ చదవడం చాలా కష్టమని మేము గుర్తించాము, ముఖ్యంగా దృష్టి లోపాలు ఉన్నవారికి, ” అని సమత్ తెలిపారు.

గూగుల్ ప్రకారం, ఆండ్రాయిడ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ (250 కోట్ల ) యాక్టివ్ పరికరాలకు శక్తినిచ్చింది. గ్లోబల్ వినియోగదారులకు మరింత స్నేహపూర్వకంగా ఉండటమే కాకుండా, "ఆండ్రాయిడ్ 10" కు పేరు మార్చడానికి, గూగుల్ సరైన సమయాన్ని ఎంచుకుందని మేము నమ్ముతున్నాము. మరొక విశేషం ఏమిటంటే, ఆండ్రాయిడ్ ఇప్పుడు ఒక దశాబ్దం ముగించుకుంది, దాని పేరులోని ‘10’ ను కొంచెం సముచితంగా చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo